CID Notice: విజయసాయిరెడ్డికి షాక్ ఇచ్చిన సీఐడీ పోలీసులు..
ABN , Publish Date - Mar 10 , 2025 | 09:30 PM
మాజీ ఎంపీ, వైసీపీ నేత విజయసాయిరెడ్డికి మంగళగిరి సీఐడీ పోలీసులు షాక్ ఇచ్చారు. బుధవారం విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేశారు.

గుంటూరు: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy)కి మంగళగిరి సీఐడీ పోలీసులు (CID Police) నోటీసులు జారీ చేశారు. ఈనెల 12న విచారణకు రావాలని ఆదేశించారు. కాకినాడ పోర్టు వాటాల బదిలీ కేసు (Kakinada Port Case) విజయసాయిరెడ్డిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. తన నుంచి అక్రమంగా పోర్టు వాటాలను బదిలీ చేయించుకున్నారని విజయసాయిరెడ్డిపై కేవీ రావు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణకు రావాలంటూ సీఐడీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. బుధవారం ఉదయం 11 గంటల కల్లా మంగళగిరి సీఐడీ కార్యాలయం వద్ద విచారణకు హాజరుకావాలంటూ ఆదేశించారు.
కాగా, కేవీ రావు ఫిర్యాదు మేరకు పోర్టు వాటాల అక్రమ బదిలీపై సాయిరెడ్డితోపాటు మెుత్తం ఐదుగురిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఏ-1 విక్రాంత్ రెడ్డి,ఏ-2 విజయసాయిరెడ్డి, ఏ-3 శరత్ చంద్రారెడ్డి, ఏ-4 శ్రీధర్, ఏ-5గా అరబిందో రియాల్టీ ఇన్ఫ్రా ఉన్నారు. మరోవైపు ఇదే కేసులో ఈడీ ఎదుట విచారణకు సైతం సాయిరెడ్డి హాజరయ్యారు. తాజాగా ఇచ్చిన నోటీసుల్లో 506, 384, 420, 109, 467, 120(B) రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్లను సీఐడీ అధికారులు ప్రస్తావించారు. మాజీ ఎంపీ సాయిరెడ్డికి సీఐడీ ఎస్పీ నోటీసులు అందించినట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Pushpa 2 controversy: అల్లు అర్జున్‍కు మరో షాక్.. ఆ చిత్రం లాభాలు పంచాలంటూ పిటిషన్..
Bail to Posani: పోసాని కృష్ణమురళీకి గుడ్ న్యూస్ చెప్పిన నరసరావుపేట కోర్టు..