Share News

Bail to Posani: పోసాని కృష్ణమురళీకి గుడ్ న్యూస్ చెప్పిన నరసరావుపేట కోర్టు..

ABN , Publish Date - Mar 10 , 2025 | 08:52 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‍పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసుల్లో సినీ నటుడు పోసాని కృష్ణమురళీకి స్వల్ప ఊరట లభించింది.

Bail to Posani: పోసాని కృష్ణమురళీకి గుడ్ న్యూస్ చెప్పిన నరసరావుపేట కోర్టు..
Bail to Posani

పల్నాడు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‍పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసుల్లో సినీ నటుడు పోసాని కృష్ణమురళీ (Posani Krishna Murali)కి స్వల్ప ఊరట లభించింది. పల్నాడు జిల్లా నరసరావుపేట రెండో పట్టణ పోలీస్ స్టేషన్‍లో నమోదైన కేసులో పోసానికి బెయిల్ (Bail to Posani) మంజూరు అయ్యింది. పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ నరసరావుపేట జూనియర్ సివిల్ జడ్జి ఆదేశాలు జారీ చేశారు.


రూ.10 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని పోసానిని న్యాయమూర్తి ఆదేశించారు. మరోవైపు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులోనూ పోసానికి కడప మొబైల్ కోర్టు గత శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. కాగా, వైసీపీ అధికారంలో ఉండగా కూటమి నేతలపై చేసిన వ్యాఖ్యలకు గానూ పోసానిపై ఏపీ వ్యాప్తంగా మెుత్తం 16 కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం కర్నూలు జైలులో రిమాండ్ ఖైదీగా పోసాని ఉన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

CID Notice: విజయసాయిరెడ్డికి షాక్ ఇచ్చిన సీఐడీ పోలీసులు..

Pushpa 2 controversy: అల్లు అర్జున్‍కు మరో షాక్.. ఆ చిత్రం లాభాలు పంచాలంటూ పిటిషన్..

Updated Date - Mar 10 , 2025 | 09:54 PM