Minister Atchannaidu: ఆక్వాకల్చర్ కమిటీ తొలి సమావేశం.. అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు
ABN , Publish Date - Aug 13 , 2025 | 03:13 PM
రిజర్వాయర్లలో కేజ్ కల్చర్ ద్వారా రూ. 5 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి పెంపు లక్ష్యంగా ప్రణాళికలు రూపోదించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు.
అమరావతి: రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధ్యక్షతన ఇవాళ(బుధవారం) సచివాలయంలో ఆక్వాకల్చర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ఆక్వాకల్చర్ యూనిట్లు తప్పనిసరిగా రిజిస్టర్ కావాలని అచ్చెన్నాయుడు ఆదేశించారు. లైసెన్స్ జారీ ప్రక్రియను సులభతరం చేయాలని అధికారులకు సూచించారు.
మత్స్యరంగ అభివృద్ధికి ప్రణాళికలు..
రిజర్వాయర్లలో కేజ్ కల్చర్ ద్వారా రూ. 5 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి పెంపు లక్ష్యంగా ప్రణాళికలు రూపోదించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ఇది రాష్ట్ర మత్స్యరంగ అభివృద్ధి, సుస్థిరమైన అక్వాకల్చర్, రైతుల ఆదాయ పెంపు, దేశీయ మార్కెట్ బలోపేతం వంటి లక్ష్యాలకు తోడ్పడుతుందని పేర్కొన్నారు. అలాగే.. రోయ్యల రైతులకు కూటమి ప్రభుత్వం నుండి సంపూర్ణ మద్దతు, ధరల స్థిరీకరణ ఉటుందని చెప్పుకొచ్చారు.
సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు..
ఆక్వా రైతులకు మేలు జరిగేలా సుంకాల భారంపై సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారని అచ్చెన్నాయుడు తెలిపారు. సుంకం తక్కువ ఉన్న దేశాలకు రొయ్యలను ఎగుమతి చేస్తే రైతులకు నష్టం వాటిల్లదని పేర్కొన్నారు. అలాగే.. చేపల ఎదుగుదలకు చికెన్ వ్యర్ధాలను చేపల చెరువలకు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. చెరువుల యజమానులపై కేసులు కూడా నమోదు చేస్తామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం మత్స్యరంగ అభివృద్ధికి పాటుపడుతుందని అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
అభిమానిని తోసేసిన జయా బచ్చన్.. దెబ్బకు జడుసుకున్నాడు..
30 ఏళ్ల స్నేహం.. ఫ్రెండ్ భార్యతో ఎఫైర్ పెట్టుకుని