CM Chandrababu Vijayadashami Greetings: తెలుగు ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు నాయుడు
ABN , Publish Date - Oct 01 , 2025 | 09:10 PM
తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు ఈ ప్రభుత్వంపై ఉండాలన్నారు. అమ్మ దయతో ప్రభుత్వ పథకాలు కొనసాగాలని ఆకాంక్షించారు.
అమరావతి, అక్టోబర్ 01: తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. సకల చరాచర జీవరాశులను సంరక్షించే శక్తి స్వరూపిణి అయిన శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు. శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే ఈ నవరాత్రి సందర్భంగా అమ్మవారి దివ్య మంగళ రూపాన్ని తొమ్మిది అవతారాల్లో దర్శించుకున్నామని తెలిపారు.
రాక్షస సంహారంతో లోకానికి శాంతి సౌభాగ్యాలు తెచ్చిన ఆ తల్లి చల్లని చూపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఇదే విధంగా కొనసాగాలని సీఎం చంద్రబాబు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. సంక్షేమం, అభివృద్ధితో ఈ మహాయజ్ఞాన్ని కొనసాగించే నైతిక బలాన్ని అందివ్వాలని ఆ దుర్గమ్మను కోరారు.
అనునిత్యం పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్లు, పేదల సేవలో పెన్షన్లు, మహిళామతల్లులకు ఆసరాగా నిలిచే ‘దీపం’, ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘స్త్రీశక్తి’, బిడ్డలను విద్యావంతుల్ని చేసే ‘తల్లికి వందనం’ రైతుకు అండగా నిలిచే ‘అన్నదాత సుఖీభవ’, పేదల చేయిపట్టి అభివృద్ధి వైపు నడిపే ‘పీ4’ విధానం, పారిశ్రామిక ప్రగతితో ఈ దసరా పండుగ ఇంటింటా వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ... మరొక్కసారి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు సీఎం చంద్రబాబు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నగదు ఇస్తానన్నా వదల్లేదు.. బాధితురాలి ఆవేదన..
For More AP News And Telugu News