CM Chandrababu Naidu: కానిస్టేబుల్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులపై సీఎం ప్రశంసలు
ABN , Publish Date - Dec 16 , 2025 | 07:29 PM
కానిస్టేబుల్ ఉద్యోగం సాధించిన పాడేరుకు చెందిన గిరిజన యువకుడు బాబురావును సీఎం చంద్రబాబు అభినందించారు. అతడు మరింత ఉన్నత స్థానాలకు అధిరోహించాలని ఆకాంక్షించారు.
అమరావతి, డిసెంబర్ 16: ఏపీలో పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులపై సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనిత ప్రశంసల వర్షం కురిపించారు.
పాడేరుకు చెందిన గిరిజన యువకుడు బాబురావును సీఎం చంద్రబాబు అభినందించారు. అతడు మరింత ఉన్నత స్థానాలకు అధిరోహించాలని ఆకాంక్షించారు. అఖిల భారత సర్వీసు సాధించి జిల్లాకు ఎస్పీ కావాలన్నారు. అనంతరం బాబురావు మాట్లాడుతూ.. తన ఊరికి రహదారి వేయాలని సీఎం చంద్రబాబును కోరారు. ఆ బాధ్యత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీసుకుంటారని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
బలభద్రపురం గ్రామానికి చెందిన మణికంఠ సైతం ఉన్నత స్థానానికి వెళ్లాలన్నారు. మణికంఠ బీఎస్సీ కెమిస్ట్రీ చదవి కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారని సీఎం చంద్రబాబు వివరించారు.
చిన్నతనం నుంచి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని గుంటూరు అర్బన్ ప్రాంతానికి చెందిన కాశింశెట్టి అఖిల్ గోపీచంద్‌కు ఉండేదన్నారు. బిఎస్సీ కంప్యూటర్స్ చేసిన అఖిల్.. ఆ దిశగా కష్టపడి చదవి ఈ ఉద్యోగం సాధించారని చెప్పారు. మీ ముఖాల్లో ఆనందం చూడాలని తాము కూటమిగా ఏర్పడి కష్టపడి పనిచేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఈ కార్యక్రమానికి హజరై నియామక పత్రం పొందిన మహిళా కానిస్టేబుల్ కొమ్ము శిరీష్ మాట్లాడుతూ.. అన్నమయ్య జిల్లా మారుమూల గ్రామం నుండి తాను వచ్చానన్నారు. తన తండ్రిని ఆడపిల్లలను చదివించ వద్దంటూ అందరూ చెప్పేవారన్నారు. తనకు ఆడబిడ్డలు అయినా.. మగబిడ్డలయినా ఒకరే వారికి తన తండ్రి చెప్పేవారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
తన సోదరి బిహార్ రాజధాని పాట్నాలోని ఎన్ఐటీలో సివిల్ ఇంజినీరింగ్ చదువుతోందని ఈ సందర్భంగా కొమ్ము శిరీష వెల్లడించారు. తనను ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదివించారని ఈ సందర్భంగా శిరీష తెలిపింది. శిరీష వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించారు. మాములు కుటుంబంలో జన్మించిన వారిని అసాధారణ పట్టుదలతో ఆ తల్లిదండ్రులు చదివించారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారికి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జిల్లా అధ్యక్షులు దాదాపు ఖరారు!
తండ్రి చాటు బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చిన కేటీఆర్
For More AP News And Telugu News