CM Chandrababu Naidu: కలెక్టర్ల సదస్సు.. సీఎం చంద్రబాబు సీరియస్..
ABN , Publish Date - Dec 17 , 2025 | 04:42 PM
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల అటెండెన్స్‌పై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. వారికి 74 శాతం మాత్రమే అటెండెన్స్ ఉండడం పట్ల మండిపడ్డారు.
అమరావతి, డిసెంబర్ 17: జిల్లా కలెక్టర్ల సమావేశంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల అటెండెన్స్‌పై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. వారికి 74 శాతం మాత్రమే అటెండెన్స్ ఉండడంపై మండిపడ్డారు. దీనిని ఎవ్వరూ అలసుగా తీసుకోవడానికి వీలు లేదన్నారు. గత ఏడాదికి సంబంధించి ప్రతి ఒక్కరి అటెండెన్స్ తన వద్ద ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఒక గంట రాలేదు, ఒక రోజు రాలేదు.. అత్యవసరం అయితే ఓకే అని తెలిపారు.
ఫీల్డ్ విజిట్‌కి వెళ్లితే ఆ విషయాన్ని ముందుగా కార్యాలయ సిబ్బందికి తెలియజేయాల్సి ఉందన్నారు. అలవాటుగా విధులకు రాకుండా ఎవరు ఉంటున్నారో వారిని గైడ్ చేయాల్సి ఉందని చెప్పారు. అప్పటికి వారు సెట్ కాకుంటే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాంటి వారిపై క్రమశిక్షణా చర్యలు ఉంటాయని చెప్పారు. అలవాటుగా మారితే చూస్తే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. వారి అటెండెన్స్‌ను పర్యవేక్షించాలంటూ జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
తయారీ రంగంపై దృష్టి పెట్టాలి: కేంద్రానికి రాహుల్ కీలక సూచన
For More AP News And Telugu News