Share News

Srinivas Goud: రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

ABN , Publish Date - Dec 17 , 2025 | 04:16 PM

తెలంగాణలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి శ్రీనివాస్ రెడ్డి జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ సర్పంచ్‌లు గెలుపొందిన గ్రామాలకు నిధులు ఇవ్వకుండా ఆ ఊర్లోకి ఎమ్మెల్యేలు అడుగు పెట్టగలరా? అంటూ ప్రశ్నించారు.

Srinivas Goud: రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్, డిసెంబర్ 17: రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. ఈ ప్రభుత్వంతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని మండిపడ్డారు. బుధవారం మహబూబ్‌నగర్‌లో పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్, వార్డు మెంబర్లను మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి ఆయన సన్మానించారు. అనంతరం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు కాంగ్రెస్ పార్టీ ఒకటి, రెండు మించి సర్పంచ్‌ స్థానాలను గెలవ లేదన్నారు.

తమ పార్టీ అభ్యర్థులకు సింబల్ ఉంటే అధిక స్థానాలు కైవసం చేసుకునే వాళ్లమని చెప్పారు. గ్రామాలకు వచ్చే నిధులు ఎవ్వరు ఆపలేరని ఈ సందర్బంగా ఆయన స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమి పాలయ్యే సరికి.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు బెదిరింపులకు దిగారన్నారు. ఎమ్మెల్యేలు చెప్పే మాటలు అబద్ధమని పేర్కొన్నారు.


రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ సర్పంచ్‌లు గెలుపొందిన గ్రామాలకు నిధులు ఇవ్వకుండా ఆ ఊర్లోకి ఎమ్మెల్యేలు అడుగు పెట్టగలరా? అంటూ ప్రశ్నించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్ సత్తా చాటాలంటూ ప్రజలకు ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. గెలిచే అభ్యర్థులను బరిలో నిలబెట్టి కలిసికట్టుగా పని చేద్దామని పార్టీ కేడర్‌కు ఈ సందర్బంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ జిల్లాకు రెండేళ్లలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదంటూ పెదవి విరిచారు. మన జిల్లాకు అన్నం పెట్టేది పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్ అని గుర్తు చేశారు. గత రెండేళ్లుగా ఈ ప్రాజెక్టును నిలిపేశావరంటూ రేవంత్ ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు.


మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కామెంట్స్..

ఈ సన్మాన సభకు భారీ ఎత్తున కేడర్ రావడం బట్టి చూస్తే.. బీఆర్ఎస్ పార్టీకి పూర్వవైభవం రాబోతుందనడానికి ఇదే నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సభకు వచ్చిన క్యాడర్‌ను చూస్తే.. తన కడుపు నిండిపోయిందని చెప్పారు. ఈ ఎన్నికల్లో గెలుపొందిన వార్డు మెంబర్లు, సర్పంచ్‌లకు ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఓటమి పాలైన అభ్యర్థులు ఎవ్వరూ బాధపడ వద్దంటూ సూచించారు.


బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మీరే సర్పంచ్‌లుగా ఉంటారన్నారు. కాంగ్రెస్ పాలనలో ఎవ్వరు సంతోషంగా లేరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను ముఖ్యమంత్రి అవుతానంటే.. జిల్లాలోని మొత్తం 12 స్థానాలను నుంచి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించారని గుర్తు చేశారు. కానీ ఈ జిల్లాకు సీఎం రేవంత్ చేసిందేమీ లేదన్నారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్ ముందుకు కదలడం లేదని తెలిపారు. సర్పంచ్ ఎన్నికల్లో పని చేసినట్టుగానే అసెంబ్లీ ఎన్నికల్లో పని చేయాల్సి ఉందంటూ కేడర్‌కు పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతానికి అన్ని విధాలా కృషి చేద్దామని పార్టీ నేతలకు ఆయన సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మరికాసేపట్లో తీర్పు.. ఆ ఎమ్మెల్యేలపై వేటు పడుతుందా..?

మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ 36ల మధ్యలో 63 ఎక్కడుందో 7 సెకెన్లలో కనిపెట్టండి..

For More TG News And Telugu News

Updated Date - Dec 17 , 2025 | 04:19 PM