Share News

MLAs Defection Case: మరికాసేపట్లో తీర్పు.. ఆ ఎమ్మెల్యేలపై వేటు పడుతుందా..?

ABN , Publish Date - Dec 17 , 2025 | 03:05 PM

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ భరితంగా మారింది. మరికాసేపట్లో ఐదుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేల భవితవ్యం తేలనుంది. సరిగ్గా 3.30 గంటలకు ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై..

MLAs Defection Case: మరికాసేపట్లో తీర్పు.. ఆ ఎమ్మెల్యేలపై వేటు పడుతుందా..?
Telangana MLAs Defection Case

హైదరాబాద్, డిసెంబర్ 17: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ భరితంగా మారింది. మరికాసేపట్లో ఐదుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేల భవితవ్యం తేలనుంది. సరిగ్గా 3.30 గంటలకు ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు వెలువరించనున్నారు. మరికాసేపట్లో అసెంబ్లీకి రానున్న స్పీకర్ గడ్డం ప్రసాద్.. ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ పార్టీ ఫిరాయింపు అంశంపై తీర్పు ప్రకటించనున్నారు.


గురువారం నాడు మరో ముగ్గురు ఎమ్మెల్యేల కేసులోనూ స్పీకర్ తీర్పు ప్రకటించనున్నారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై డిసెంబర్ 18వ తేదీ లోపు నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌కు సుప్రీంకోర్టు సూచించింది. దీని ప్రకారం రేపటితో(గురువారం) సుప్రీంకోర్టు గడువు ముగియనుంది. దీంతో స్పీకర్ బుధవారం ఐదుగురు, గురువారం మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించి అంశంపై తీర్పు వెలువరించేందుకు సిద్ధమయ్యారు. అయితే, మరో ఇద్దరు ఎమ్మెల్యేల విచారణ ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటికే స్పీకర్ వారికి నోటీసులు జారీ చేయగా.. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఇంకా స్పందించలేదు. మరి ఈ ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని తీవ్ర ఉత్కంఠ నెలకొంది.


Also Read:

శీతాకాలంలో పచ్చి బఠానీలు తినొచ్చా?

మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ 36ల మధ్యలో 63 ఎక్కడుందో 7 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Dec 17 , 2025 | 03:33 PM