Share News

CM Chandrababu Delhi Tour: ఢిల్లీకి చంద్రబాబు, లోకేశ్.. ప్రధాని మోదీని కలిసి..

ABN , Publish Date - Sep 29 , 2025 | 08:31 PM

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతోపాటు మంత్రి నారా లోకేశ్ న్యూఢిల్లీ పర్యటన ఖరారైంది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారని తెలుస్తోంది.

CM Chandrababu Delhi Tour: ఢిల్లీకి చంద్రబాబు, లోకేశ్.. ప్రధాని మోదీని కలిసి..
CM Chandrababu Delhi Tour

అమరావతి, సెప్టెంబర్ 29: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu), రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌(Minister Nara Lokesh)ల దేశ రాజధాని న్యూఢిల్లీ పర్యటన ఖరారైంది. మంగళవారం ఉదయం వీరిద్దరూ న్యూఢిల్లీ(New Delhi)కి బయలుదేరి వెళ్లనున్నారు. సీఐఐ సదస్సు (CII Summit)లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman)తోనూ ఆయన భేటీ కానున్నారు. అక్టోబర్ 16వ తేదీన కర్నూలులో జీఎస్టీ 2. 0 కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు అధికారికంగా ఆహ్వానించనున్నారు. మరోవైపు నారా లోకేశ్ సైతం న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్రమంత్రులతో సమావేశమవుతారని తెలుస్తోంది.


అక్టోబరు 16వ తేదీన కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. జీఎస్టీ సంస్కరణలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కర్నూలు నగరంలో ప్రధాని రోడ్‌షో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌‌తోపాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలూ పాల్గొంటారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ఇప్పటికే పూర్తి చేసిన పలు పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ.. శ్రీశైలంలోని మల్లికార్జునస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. ఓర్వకల్లు సమీపంలోని ప్రధాని సభ ఏర్పాటుకు అనువైన స్థలం కోసం జిల్లా ఉన్నతాధికారులు ఇప్పటికే పరిశీలిస్తున్నారు. కాగా, ఓర్వకల్లు సమీపంలో 415 ఎకరాల విస్తీర్ణంలో జైరాజ్‌ ఇస్పాత్‌ ఉక్కు పరిశ్రమను ప్రధాని ప్రారంభించనున్నారని తెలుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు

సియోల్‌లో రోడ్డు షో.. మంత్రి కీలక వ్యాఖ్యలు

For More AP News And Telugu News

Updated Date - Sep 29 , 2025 | 08:48 PM