Chinta Mohan: ఇందిరా గాంధీ చేసిన విధంగా ఉంటుందని అనుకున్నాం..
ABN , Publish Date - May 15 , 2025 | 12:50 PM
Chinta Mohan: భారత్, పాకిస్తాన్ యుద్ధంపై ప్రధాని మోదీ అఖిల పక్షంతో చర్చించి యుద్దం ఆపితే బాగుండేదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతా మోహన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలో మానవ హక్కులకు భంగం వాటిల్లుతోందని, 20 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీలకు బ్యాంకులు రుణాలు సరిగా ఇవ్వటం లేదని ఆరోపించారు.
గుంటూరు జిల్లా: భారత్ (India), పాకిస్తాన్ (Pakistan) మధ్య యుద్ధం (War) మొదలై మధ్యలో ఆగిపోయిందని, గతంలో ఇందిరా గాంధీ (Indira Gandhi) చేసిన విధంగా ఉంటుందని అనుకున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత (Congress Leader), మాజీ మంత్రి చింతా మోహన్ (Ex Minister Chinta Mohan) అన్నారు. గురువారం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ.. యుద్ధంలో భారత సైన్యం (Indian Army) చూపిన ధైర్య సాహసాలకు, దేశ ప్రతిష్టతను కాపాడుతున్న సైనికులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Indian Army) చేతిలో ప్రధాని మోదీ (PM Modi) కీలు బొమ్మలా మారారని ఢిల్లీలో అనుకుంటున్నారని.. ఒక్క ఫోన్ కాల్‌తో ట్రంప్ యుద్ధాన్ని ఆపటం పార్టీలు జీర్ణించుకోలేక పోతున్నాయని అన్నారు.
అఖిల పక్షంతో చర్చించి...
ప్రధాని మోదీ అఖిల పక్షంతో చర్చించి యుద్దం ఆపితే బాగుండేదని చింతా మోహన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలో మానవ హక్కులకు భంగం వాటిల్లుతోందని, 20 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీలకు బ్యాంకులు రుణాలు సరిగా ఇవ్వటం లేదని ఆరోపించారు. ఒక్క శాతం ఉన్న మార్వాడీలకు మాత్రం 50 శాతం రుణాలు ఇస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ కాంట్రాక్టులు ఏపీలో కూటమి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ లకు ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. వేల కోట్ల విలువైన మైనింగ్‌లను కూటమి ప్రభుత్వం కొందరికే దోచి పెడుతోందని, రాజధాని అమరావతి ఒక రియల్ ఎస్టేట్ కాకూడదని అన్నారు.
Also Read: బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మోసం...
రాజధాని నిర్మాణం పారదర్శకంగా ఉండాలి..
గతంలో సీపీఎం నేత రాఘవులు రాజధానికి కేవలం వెయ్యి ఎకరాలు సరిపోతాయని చెప్పారన్న విషయాన్ని ఈ సందర్బంగా చింతా మోహన్ గుర్తు చేశారు. రాజధాని అవినీతికి అడ్డాగా మారకూడదని.. వేల కోట్లు ఒకే చోట పెట్టటం బాధాకరమన్నారు. రాజధాని నిర్మాణం పారదర్శకంగా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రజలు కూటమి పాలనపై అసంతృప్తితో ఉన్నారని చింతా మోహన్ వ్యాఖ్యానించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కంచ గచ్చిబౌలి భూముల కేసు.. సుప్రీం కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం
For More AP News and Telugu News