Share News

CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం

ABN , Publish Date - Nov 27 , 2025 | 08:23 PM

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. గురువారం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ అయింది.

CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం

అమరావతి, నవంబర్ 27: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. గురువారం రాజధాని అమరావతిలోని ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో పార్టీ ఎంపీలు, ముఖ్యనేతలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన ప్రయోజనాల సాధనకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సందర్భంగా చర్చిస్తున్నారు.


మరో వైపు ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన సాగుతోంది. దీంతో ఏపీలో అభివృద్ధికి కేంద్రం తన వంతు సహాయ సహకారాలు అందిస్తుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఇవి డిసెంబర్ 19వ తేదీతో ముగుస్తాయి. 2014లో ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ తొలిసారి బాధ్యతలు చేపట్టారు. ఆయన అధికారం చేపట్టిన తర్వాత జరుగుతున్న శీతాకాల సమావేశాల్లో ఇది అత్యంత తక్కువ కాలం. అంటే కేవలం 19 రోజులు మాత్రమే ఈ సమావేశాలు జరగనున్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

మెడికల్ కాలేజీల్లో ఈడీ అధికారులు సోదాలు

మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 27 , 2025 | 08:47 PM