ED Raids In Medical Colleges: మెడికల్ కాలేజీల్లో ఈడీ అధికారులు సోదాలు
ABN , Publish Date - Nov 27 , 2025 | 07:03 PM
మెడికల్ కాలేజీల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు ఇటీవల జరిపిన తనిఖీల్లో సీబీఐ అధికారులు గుర్తించారు. ఆయా కాలేజీలపై కేసులు నమోదు చేశారు. వాటి ఆధారంగా ఈడీ అధికారులు రంగంలోకి దిగి ప్రత్యక్ష దాడులు చేపట్టారు.
అమరావతి, నవంబర్ 27: మెడికల్ కాలేజీల్లో అవినీతి, అక్రమాలు భారీ ఎత్తున చోటు చేసుకుంటున్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీలపై ఈడీ అధికారులు గురువారం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. గతంలో కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) పీజీ సీట్లు కేటాయింపులో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో ఇటీవల మెడికల్ కౌన్సిల్ సభ్యులతోపాటు మెడికల్ కాలేజీల ప్రతినిధులను సీబీఐ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. అనంతరం తాజాగా ఈడీ అధికారులు ప్రత్యక్షంగా రంగంలోకి దిగి ఈ దాడులు నిర్వహించారు.
మరో వైపు దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో సోదాలను ఈడీ అధికారులు చేపట్టారు. ఏపీ, తెలంగాణతో సహా 10 రాష్ట్రాల్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ తనిఖీల చేసే సమయంలో తాత్కాలిక ఏర్పాట్లతో మెడికల్ కాలేజీలు మాయ చేస్తున్నట్లు సీబీఐ తన సోదాల్లో గుర్తించింది. అలాగే ఎన్ఎంసీ ప్రమాణాలు పాటించకుండానే అనుమతులు పొందినట్లు ఈ సోదాల్లో కనుగొంది. దీంతో మెడికల్ కాలేజీలపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం
Read Latest TG News And Telugu News