CM Chandrababu: వైసీపీ అసత్య ప్రచారానికి చెక్.. జగన్ గూబ గుయ్యమనేలా తల్లికి వందనంపై చంద్రబాబు కీలక ప్రకటన..
ABN , Publish Date - Mar 12 , 2025 | 07:08 PM
తల్లికి వందనం పథకం కింద చదువుతున్న పిల్లలకు ఏడాదికి రూ.15వేలు అందిస్తామని తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి వైసీపీ తల్లికి వందనం పథకం అమలు చేయడం లేదంటూ ప్రచారం చేస్తూ వస్తోంది. తాజాాగా శాసనసభ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు తల్లికి వందనం పథకంపై స్పష్టతనిచ్చారు.

కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయటమే వైసీపీ పనిగా పెట్టుకుంది. ప్రతీ విషయంలోనూ ప్రభుత్వంపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తోంది. అసత్య ప్రచారాలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తూ ఉంది. ముఖ్యంగా పథకాల అమలు విషయంలో తప్పుడు ప్రచారాలు పెచ్చు మీరిపోయాయి. అయితే.. వైసీపీ ఎంత ప్రయత్నించినా తప్పుడు ప్రచారాలు మాత్రం ఫలించడం లేదు. కూటమి ప్రభుత్వం ఎక్కడికక్కడ వాటిని తిప్పి కొడుతోంది. ఇందుకు తల్లికి వందనం పథకమే ప్రత్యక్ష ఉదాహరణ. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని అమలు చేయదంటూ వైసీపీ తెగ ప్రచారం చేసింది.
వైసీపీ అసత్య ప్రచారం
కూటమి ప్రభుత్వం పేద పిల్లల భవిష్యత్తును నాశనం చేయడానికి ప్రయత్నిస్తోందంటూ మొసలి కన్నీరు కార్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టారు. తల్లికి వందనం పథకాన్ని నూటికి నూరు శాతం అమలు చేసి తీరుతానని స్పష్టం చేశారు. మే నెల నుంచి పథకాన్ని అమలు చేస్తామన్నారు. ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమందికి కూడా పథకాన్ని అమలు చేస్తామన్నారు. తాజాగా మరో సారి తల్లికి వందనం పథకం అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీ సాక్షిగా వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారానికి చెక్ పెట్టారు.
మే నెల నుంచి పథకాన్ని అమలు చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇంట్లో ఎంత మంది చదువుకునే పిల్లలు ఉంటే అంత మందికి కూడా పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. ప్రతీ ఒక్క పిల్లాడికి 15 వేల రూపాయలు ఇస్తామన్నారు. ఇక, ప్రభుత్వం తల్లికి వందనం పథకం కోసం 2024-2025 విద్యా సంవత్సరానికి గానూ 9,407 కోట్ల రూపాయలు కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 78 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం కింద లబ్ధి పొందనున్నారు. వైసీపీ ప్రభుత్వం మాత్రం కేవలం 48 లక్షల మంది విద్యార్థులకు మాత్రమే పథకాన్ని వర్తింపజేసింది.కాగా, ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలను కూటమి ప్రభుత్వం త్వరలో వెల్లడించనుంది.
ఇవి కూడా చదవండి...
Borugadda Anil: ఏపీ హైకోర్టు సీరియస్..లొంగిపోయిన బోరుగడ్డ
AP Legislative Council: సభ మొదలవగానే షూరూ చేసిన వైసీపీ..
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here