YSRCP MLCs Join TDP: టీడీపీలో చేరనున్న వైసీపీ ఎమ్మెల్సీలు..
ABN , Publish Date - Sep 19 , 2025 | 02:13 PM
వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. శుక్రవారం వీరంతా ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. వారికి సీఎ చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారు.
అమరావతి, సెప్టెంబర్ 19: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఎమ్మెల్సీలు బల్లి కల్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్.. శుక్రవారం నాడు అమరావతిలో సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు.
ఈ సందర్భంగా ఈ ముగ్గురికీ సీఎం చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. అయితే ఈ ముగ్గురు ఎమ్మెల్సీలు ఇప్పటికే వైసీపీతోపాటు అనుభవిస్తున్న పదవులకు సైతం రాజీనామా చేశారు. కానీ, వీరి ఎమ్మెల్సీ రాజీనామాలపై శాసనమండలి చైర్మన్ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీని ఒక్కొక్కరుగా వీడుతున్నారు. ఆ జాబితాలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన విజయసాయిరెడ్డి సైతం ఉన్నారు. సాయిరెడ్డి తన పదవికే కాదు.. రాజ్యసభ సభ్యత్వానికి సైతం రాజీనామా చేశారు. అలాగే వైసీపీ నుంచి రాజ్యసభకు వెళ్లిన పలువురు ఎంపీలూ వైసీపీతోపాటు ఆ పదవులకు సైతం గుడ్ బై చెప్పేశారు. ఆ జాబితాలో తాజాగా ఈ ముగ్గురు ఎమ్మెల్సీలు చేరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్‌కు బిగ్ షాక్.. టీడీపీలోకి మరో నేత!
విజయవాడకు ఎంపీ మిథున్‌రెడ్డి..
For More AP News And Telugu News