Share News

AP High Court: సత్యసాయి జయంతి వేడుకలపై పిల్.. పిటిషనర్‌కు హైకోర్టు వార్నింగ్

ABN , Publish Date - Oct 29 , 2025 | 07:28 PM

పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా జయంతి ఉత్సవాలను ప్రభుత్వ ఖర్చుతో నిర్వహించకూడదంటూ ఒంగోలుకు చెందని వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు పిటిషనర్‌కు వార్నింగ్ సైతం ఇచ్చింది. రాష్ట్ర వేడుకగా నిర్వహించాలని కూటమి సర్కారు ఇప్పటికే నిర్ణయించింది.

AP High Court: సత్యసాయి జయంతి వేడుకలపై పిల్.. పిటిషనర్‌కు హైకోర్టు వార్నింగ్

అమరావతి, అక్టోబర్ 29: పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా జయంతి ఉత్సవాలను రాష్ట్ర వేడుకగా నిర్వహించాలని కూటమి సర్కారు ఇప్పటికే నిర్ణయించింది. ఈ ఉత్సవాలను రాష్ట్ర వేడుకగా నిర్వహించడంపై ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన భారత హేతువాద సంఘం అధ్యక్షుడు వెంకట సుబ్బయ్య.. ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దాఖలు చేశారు. ప్రభుత్వ నిధులను ఇలా మతపరమైన కార్యక్రమాలకు మళ్లించడానికి వీలు లేదంటూ ఆ పిటిషన్‌లో వెంకట సుబ్బయ్య స్పష్టం చేశారు. ఈ పిల్‌పై బుధవారం ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది.


సత్యసాయి జయంతి ఉత్సవాలను రాష్ట్ర వేడుకగా నిర్వహిస్తే తప్పేముందని పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. సత్యసాయి ట్రస్ట్ ద్వారా మూడు జిల్లాలకు తాగు నీరు అందించారంటూ పిటిషనర్‌కు హైకోర్టు గుర్తు చేసింది. అంతే కాదు.. ఆసుపత్రులు, విద్యాసంస్థలు సైతం స్థాపించి ప్రజలకు సేవ చేస్తున్నారని పిటిషనర్‌కు ఈ సందర్భంగా హైకోర్ట్ వివరించింది.


ఇలాంటి విశిష్ట వ్యక్తులను గౌరవించడంలో తప్పేమందంటూ పిటిషనర్‌ను హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. ఈ పిల్‌ ఉపహరించుకోవాలని పిటిషనర్‌‌ను హైకోర్టు ఆదేశించింది. లేకుంటే ఖర్చులు విధిస్తామని పిటిషనర్‌ను హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని పిటిషనర్ వెంకట సుబ్బయ్య వెంటనే ఉపసంహరించుకున్నారు.


పుట్టపర్తిలో ప్రశాంతి నిలయాన్ని భగవాన్ శ్రీసత్యసాయి బాబా స్థాపించారు. సత్యసాయి ట్రస్టు ద్వారా రాయలసీమలోని పలు జిల్లాలకు తాగు నీరు అందించారు. అలాగే స్కూళ్లు, ఆసుపత్రులు నిర్మించి.. ఉచితంగా వైద్యసేవలు అందించారు. శ్రీసత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలకు హాజరుకావాలని ఇప్పటికే ప్రధాని మోదీ, తెలుగు రాష్ట్రాలతోపాటు వివిధ రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, మంత్రులకు ట్రస్ట్ సభ్యులు ఇప్పటికే ఆహ్వానాలు అందజేశారు. నవంబర్ 19న ఈ జయంతి ఉత్సవాలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఈ మూడు రాశులకు రాజయోగం

అలా అయితే కృష్ణా నదిలో క్రికెట్ ఆడుకోవడమే..: కవిత

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 29 , 2025 | 09:20 PM