PowerFull RajaYogam: ఈ మూడు రాశులకు రాజయోగం
ABN , Publish Date - Oct 29 , 2025 | 06:01 PM
నవంబర్ మాసంలో ముచ్చటగా మూడు రాశులకు రాజయోగం పట్టనుంది. దీంతో ఆ రాశుల వారికి దశ తిరగనుంది. ఒక విధంగా చెప్పాలంటే.. వారు జాక్ పాట్ కొట్టినట్లే
PowerFull RajaYogam: మాలవ్య రాజయోగం.. అత్యంత పవర్ ఫుల్ రాజయోగం. ప్రస్తుతం మూడు రాశుల జాతకాలను శుక్రుడు మార్చబోతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల కదలికలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ గ్రహాల స్థానచలనం కారణంగా.. పలు శభ, అశుభ యోగాలు ఏర్పడుతుంటాయి. నవంబర్‌లో శుక్రుడు తన రాశిని మార్చుకోబోతున్నాడు. ఈ నేపథ్యంలో పవర్ ఫుల్ మాలవ్య రాజయోగం ఏర్పడనుంది. అత్యంత శుభాలను ఇచ్చే ఈ రాజయోగం.. నాలుగు రాశులకు అదృష్ట యోగాన్ని తీసుకు రానుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మాలవ్య రాజయోగం మహా పురుష రాజయోగాల్లో ఒకటి. ఇది అత్యంత శుభప్రదమైనదని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. సంపద, శ్రేయస్సు, విలాసాలకు శుక్రుడు కారకుడు. ఆయన సొంత రాశి తులా రాశిలో సంచరిస్తున్నాడు. ఈ సమయంలో రాజయోగం ఏర్పడుతుంది. శుక్రుడు నవంబర్ 2వ తేదీన తులారాశిలోకి ప్రవేశించనున్నాడు. దాంతో ఈ రాజయోగం ఏర్పడనుంది. ఈ యోగం నవంబర్ 26వ తేదీ వరకు ఉంటుంది. ఈ సమయంలో మూడు రాశుల వారికి శుభకరంగా ఉంటుంది. కొత్త ఉద్యోగాలు రావడం, సంపదను సైతం ఈ రాజయోగం తీసుకువస్తుంది. ఈ మాసం నెలాఖరు వరకు గణనీయమైన వృద్ధిని చూస్తారు.
తులారాశి..
ఈ రాశిలో జన్మించిన వారు మాలవ్య రాజయోగం కారణంగా.. అధిక ప్రయోజనం పొందుతారు ఎందుకంటే శుక్రుడు ఈ రాశిలో సంచరించనున్నాడు. ఈ రాశిలో సంచార సమయంలో ఈ రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం కారణంగా వ్యక్తిత్వం మెరుగు పడుతుంది. సంపద తీసుకువస్తుంది. నూతన ఉద్యోగం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. సంబంధాలు బలపడతాయి. అవివాహితులకు వివాహ యోగ సూచనలున్నాయి. భాగస్వామ్య వ్యాపారాల్లోని వారికి ప్రయోజనం చేకూరుతుంది.
మకరరాశి..
ఈ రాశిలో జన్మించిన వారికి కూడా ఈ రాజయోగం చాలా శుభకరంగా ఉంటుంది. చాలా ప్రయోజనాలు పొందే సూచనలు గోచరిస్తున్నాయి. ఉద్యోగాల్లో ప్రమోషన్లు లభించే అవకాశాలున్నాయి. వ్యాపారంలో ఉన్న వారికి అదృష్టం మరింత బాగా కలిసి వస్తుంది. ఆకస్మిక నగదును అందుకుంటారు. అలాగే ఈ సమయంలో మిమ్మల్ని అందరు ప్రశంసలతో ముంచెత్తుతారు. మీ పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. జీవితం ఆనందమయం అవుతుంది.
ధనుస్సు రాశి..
ఈ రాశి వారికి ఈ సమయంలో అధిక ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయి. కొత్త ఆదాయ వనరులు సమకూరుతాయి. పెట్టుబడుల కారణంగా లాభాలను చూస్తారు ఆకస్మిక ధనలాభం సూచితం. షేర్లలో పెట్టుబడులు పెట్టే వారు సైతం లాభాలను ఆర్జిస్తారు. అందకుండా పోయిన నగదు తిరిగి చేతికి చేరుతుంది. శుభవార్తలు సైతం వినే అవకాశం ఉంది.
గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, పల శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా పేర్కొన్నవి మాత్రమే. వీటికి ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయానని పాఠకులు గమనించాలి. దీనిని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇంతకీ కార్తీక పౌర్ణమి ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి.. ?
కార్తీక మాసంలో ఈ నాలుగు ఆచరిస్తే..
For More Devotional News And Telugu News