AP High Court: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల్లో అక్రమాలు.. హైకోర్టు కీలక ఆదేశాలు
ABN , Publish Date - Nov 26 , 2025 | 08:23 PM
ఏపీపీఎస్సీ గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షల్లో అక్రమాలు తేల్చే విషయంలో ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అందులో సభ్యును సైతం నియమించింది.
అమరావతి, నవంబర్ 26: ఏపీపీఎస్సీ గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షల్లో అక్రమాలను తేల్చే విషయంలో ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అందుకోసం హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కేజీ శంకర్ నేతృత్వంలోని స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఏపీ హైకోర్టు బుధవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో జస్టిస్ కేజీ శంకర్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. బార్ కౌన్సిల్ మాజీ చైర్మన్ గంటా రామారావు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పూర్వ వైస్ చాన్స్‌లర్ ప్రొ. రాజేంద్రప్రసాద్ సభ్యులుగా నియామించింది.
హాయ్ ల్యాండ్‌లో జవాబు పత్రాలు మూల్యాంకనం జరిగిందా? ఓఎంఆర్ షీట్లపై మార్కులు నమోదు చేశారా? లేదా అనే విషయంపై అసలు వాస్తవాలు నిర్ధారించాలని ఈ కమిటీకి ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కమిటీ సమక్షంలో జవాబు పత్రాలు, ఓఎంఆర్ షీట్లు పరిశీలించేందుకు ఇరువైపులా న్యాయవాదులకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి..
బీసీలకు మోసం జరుగుతుంటే.. బీఆర్ఎస్ నుంచి నో రియాక్షన్: కవిత
For More AP News And Telugu News