Share News

Minister Lokesh: జగన్ మెహన్ రెడ్డి ఆర్థిక విధ్వంసంపై లెక్కలు చూపిన మంత్రి లోకేశ్..

ABN , Publish Date - Feb 17 , 2025 | 12:50 PM

ఆంధ్రప్రదేశ్ గత ముఖ్యమంత్రులు చేసిన అప్పులకు కట్టే వడ్డీ కంటే ఐదేళ్లలో జగన్ చేసిన అప్పులకు కట్టే వడ్డీలు ఎక్కువని మంత్రి లోకేశ్ తెలిపారు. 58 ఏళ్లపాటు ఏపీ ముఖ్యమంత్రులుగా ఉన్న అందరూ కలిపి చేసిన అప్పులపై 2019 నాటికి రూ.14,155 కోట్లు వడ్డీగా చెల్లిస్తున్నట్లు లోకేశ్ వెల్లడించారు.

Minister Lokesh: జగన్ మెహన్ రెడ్డి ఆర్థిక విధ్వంసంపై లెక్కలు చూపిన మంత్రి లోకేశ్..
Minister Lokesh

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) సృష్టించిన ఆర్థిక విధ్వంసం అంతా ఇంతా కాదని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. వైసీపీ (YSRCP) ఐదేళ్ల పాలనలో జగన్ రెడ్డి అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఇష్టమెుచ్చినట్లు అప్పులు చేసి ఏపీ ప్రభుత్వంపై పెను భారం మోపారని ఆగ్రహించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఇందులో సీఎంగా జగన్ చేసిన అప్పులకు కడుతున్న వడ్డీలకు సంబంధించిన పత్రాలను జోడించారు.


ఆంధ్రప్రదేశ్ గత ముఖ్యమంత్రులు చేసిన అప్పులకు కట్టే వడ్డీ కంటే ఐదేళ్లలో జగన్ చేసిన అప్పులకు కట్టే వడ్డీలు ఎక్కువని మంత్రి లోకేశ్ తెలిపారు. 58 ఏళ్లపాటు ఏపీ ముఖ్యమంత్రులుగా ఉన్న అందరూ కలిపి చేసిన అప్పులపై 2019 నాటికి రూ.14,155 కోట్లు వడ్డీగా చెల్లిస్తున్నట్లు లోకేశ్ వెల్లడించారు. అయితే జగన్ రెడ్డి పాలించిన ఐదేళ్ల కాలానికి అంటే 2024 నాటికి అప్పులపై కట్టాల్సిన వడ్డీ రూ.24,944 కోట్లకు చేరిందని మంత్రి తెలిపారు. దాదాపు ఏపీకి చెందిన ముఖ్యమంత్రులు అందరూ చేసిన అప్పుపై కట్టిన వడ్డీ కంటే జగన్ రెడ్డి చేసిన అప్పుపై కట్టే వడ్డీనే సుమారు రూ.11 వేల కోట్లు అధికమని వెల్లడించారు. అందినకాడికి అప్పులు చేసి జగన్ రెడ్డి ఎంతటి ఆర్థిక విధ్వంసం సృష్టించారో ఈ గణాంకాలే నిదర్శనమని మంత్రి లోకేశ్ మండిపడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Students Protest: బాత్రూంలోకి తొంగిచూస్తున్నారు.. విద్యార్థినుల ఆందోళన

Heart Breaking Incident.. అల్వాల్‌లో హృదయ విదారక ఘటన..

Updated Date - Feb 17 , 2025 | 01:25 PM