IPS Transfer in AP: భారీగా ఐపీఎస్‌లు బదిలీ..
ABN , Publish Date - Sep 13 , 2025 | 04:15 PM
మూడు రోజుల తేడాతో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం.. శనివారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్రంలో భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి, సెప్టెంబర్ 13: ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐపీఎస్ అధికారుల(IPS Transfer in AP)ను చంద్రబాబు సర్కార్ బదిలీ చేసింది. 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్(K.Vijayanand) ఇవాళ (శనివారం) ఆదేశాలు జారీ చేశారు. కాగా, వీటిలో ఏడు జిల్లాలకు ఎస్పీలుగా కొత్త అధికారులను నియమించారు. అలాగే మరో ఏడు జిల్లాలకు ఇతర జిల్లాల ఎస్పీలను బదిలీ చేశారు. అదే విధంగా 12 జిల్లాల్లో ఉన్న వారినే ఎస్పీలుగా కొనసాగిస్తున్నట్లు జారీ చేసిన ఉత్తర్వుల్లో సీఎస్ స్పష్టం చేశారు.
బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ: రాహుల్ మీనా
బాపట్ల జిల్లా ఎస్పీ: ఉమామహేశ్వర్
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్పీ: అజితా వేజెండ్ల
తిరుపతి జిల్లా ఎస్పీ: సుబ్బారాయుడు
అన్నమయ్య జిల్లా ఎస్పీ: ధీరజ్ కునుగిలి
వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీ: నచికేత్
నంద్యాల జిల్లా ఎస్పీ: సునీల్ షెరాన్
వీరంతా ఆయా జిల్లాలకు కొత్త ఎస్పీలుగా నియమితులయ్యారు.
విజయనగరం జిల్లా ఎస్పీ: ఎ.ఆర్.దామోదర్
కృష్ణా జిల్లా ఎస్పీ: విద్యాసాగర్ నాయుడు
గుంటూరు జిల్లా ఎస్పీ: వకుల్ జిందాల్
పల్నాడు జిల్లా ఎస్పీ: డి.కృష్ణారావు
ప్రకాశం జిల్లా ఎస్పీ: హర్షవర్థన్ రాజు
చిత్తూరు జిల్లా ఎస్పీ: తుషార్ డూడి
శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ: సతీష్ కుమార్
వీరంతా.. ఈ జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ చేయబడ్డారు.
మరోవైపు శ్రీకాకుళం, పార్వతీపురం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, అనంతపురం, కర్నూలు జిల్లాల ఎస్పీలు యథాతథంగా కొనసాగుతారని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో ఉంది. ఇక, ఈ వారంలో రోజుల వ్యవధిలోనే రెండు దశల్లో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆ వెంటనే ఐపీఎస్ అధికారులను కూటమి ప్రభుత్వం బదిలీ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
వైసీపీ కార్యకర్తకు మంత్రి లోకేశ్ అభయ హస్తం
యువతిపై లైంగిక దాడి.. మీ దేశానికి వెళ్లాలంటూ నిందితులు ఆదేశం
For More AP News And Telugu News