Heavy Rains: భారీ వర్షాలు.. ప్రజలకు కీలక సూచన: ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ
ABN , Publish Date - Nov 03 , 2025 | 09:57 PM
రాష్ట్రంలోని పలు జిల్లాలో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. మంగళవారం కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
అమరావతి, నవంబర్ 03: రాష్ట్రంలోని పలు జిల్లాలో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. మంగళవారం కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
అయితే అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అయితే ఆ సమయంలో చెట్లు కింద నిలబడ వద్దంటూ ప్రజలకు విపత్తు నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. ఇటీవ మొంథా తుపాన్ కారణంగా.. ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో పంటలకు భారీ నష్టం వాటిల్లింది. అయితే ఆర్టీజీఎస్ ద్వారా తుపాన్ ప్రభావాన్ని ముందుగానే పసిగట్టి.. నష్టాన్ని దాదాపుగా ప్రభుత్వం నియంత్రించింది.
మరోవైపు మొంథా తుఫాన్ కారణంగా తెలంగాణలోని పలు జిల్లాలు చిగురుటాకులా వణికిపోయాయి. వరంగల్, హన్మకొండ జిల్లాలు నీట మునిగాయి. ఆ తుఫాన్ నుంచి జనాలు ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా కోలుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ (Telangana Weather) వాసులకు మరో బిగ్ అలర్ట్ ఇచ్చింది. హైదరాబాద్ వాతావరణ శాఖ రాష్ట్రానికి మరోసారి వర్ష సూచనలు జారీ చేసింది. రానున్న మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి
మల్కాపురంతో రాణి రుద్రమ్మకు అనుబంధం
క్రమశిక్షణ కమిటీ ముందుకు తిరువూరు పంచాయితీ..
16 నెలల్లో ఏపీకి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు: నారా లోకేశ్
Read Latest AP News And Telugu News