AP FiberNet: ఫైబర్‌నెట్ టెక్నికల్ కమిటీని పునర్ నియామకం చేసిన ప్రభుత్వం
ABN , Publish Date - Jun 17 , 2025 | 09:23 PM
ఏపీ ఫైబర్‌నెట్ కార్పొరేషన్‌లో సంస్కరణలు కొనసాగుతున్నాయి. ఫైబర్‌నెట్ టెక్నికల్ కమిటీని ప్రభుత్వం పునర్ నియామకం చేసింది. తొమ్మిది మంది సభ్యులతో ఫైబర్‌నెట్ టెక్నికల్ కమిటీ నియమించింది.

అమరావతి: ఏపీ ఫైబర్‌నెట్ కార్పొరేషన్‌లో (AP FiberNet Corporation) సంస్కరణలు కొనసాగుతున్నాయి. ఫైబర్‌నెట్ టెక్నికల్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం పునర్ నియమించింది. తొమ్మిది మంది సభ్యులతో ఫైబర్‌నెట్ టెక్నికల్ కమిటీని నియామకం చేసింది. సభ్యులుగా ఫైబర్‌నెట్ ఎండీ, ఐటీశాఖ ప్రత్యేక కార్యదర్శి, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఎండీని నియమించింది. ఎస్ఎఫ్ఎల్‌లో డీపీఆర్‌లు, టెండర్ల పరిశీలనకు ఈ కమిటీ ఆమోదం తెలపనుంది. భారత్‌నెట్ రెండో దశ కార్యాచరణ, అమలు వ్యవహారాలను ఫైబర్‌నెట్ టెక్నికల్ కమిటీ చూడనుంది. నిర్ణీత వాణిజ్య, టెక్నికల్ కార్యాక్రమాలను ఫైబర్‌నెట్ టెక్నికల్ కమిటీ పర్యవేక్షించనుంది.
ఇవి కూడా చదవండి
సంచలనం.. షర్మిల కాల్స్ రికార్డ్.. అన్నకు సమాచారం
మా అమ్మ, బిడ్డలు ఏడుస్తున్నా పట్టించుకోలేదు.. శిరీష ఆవేదన
Read Latest AP News And Telugu News