AP Government: జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం
ABN , Publish Date - Nov 27 , 2025 | 08:58 PM
మూడు జిల్లాలతోపాటు ఐదు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేసింది.
అమరావతి, నవంబర్ 27: రాష్ట్రంలో మూడు జిల్లాలతోపాటు ఐదు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన నోటిఫికేషన్లను ప్రభుత్వం గురువారం జారీ చేసింది. రాష్ట్రంలో కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు మంగళవారం ఆమోదం తెలిపారు. మార్కాపురం, మదనపల్లె, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 26 నుంచి 29కి పెరిగింది.
కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు, ఒక మండలం ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. జిల్లాల పునర్విభజనపై మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించిన అనంతరం సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి, ప్రకాశం జిల్లాలో అద్దంకి, కొత్తగా ఏర్పాటయ్యే మదనపల్లి జిల్లాలో పీలేరు, నంద్యాల జిల్లాలో బనగానపల్లె, శ్రీసత్యసాయి జిల్లాలో మడకశిర రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కర్నూలు జిల్లా ఆదోని మండలాన్ని విభజించి కొత్తగా పెద్దహరివనం మండలాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇక రాష్ట్రంలో ఏర్పాటు కానున్న మూడు జిల్లాలను పరిశీలిస్తే.. రంపచోడవరం నియోజకవర్గంలోని రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్లతో కొత్తగా పోలవరం జిల్లా ఏర్పాటు కానుంది. రంపచోడవరం రెవెన్యూ డివిజన్‌లో రంపచోడవరం, దేవీపట్నం, వై రామవరం, గుర్తేడు, అడ్డతీగల, గంగవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి మండలాలు ఉండనున్నాయి. ఇక చింతూరు డివిజన్‌లో యెటపాక, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం మండలాలను చేర్చారు.
యర్రగొండుపాలెం, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు నియోజకవర్గాల్లోని మార్కాపురం, కనిగిరి రెవెన్యూ డివిజన్లతో కొత్త జిల్లాగా మార్కాపురం ఏర్పాటు కానుంది. ఈ రెవెన్యూ డివిజన్‌లోని యర్రగొండుపాలెం, పుల్లల చెరువు, త్రిపురాంతకం, దోర్నాల, పెద్దారవీడు తుర్లుపాడు, మార్కాపురం, పొదిలి, కొనకనమిట్ల మండలాలు, అలాగే కనిగిరి డివిజన్‌లోని హనుమంతునిపాడు, వెలిగండ్ల, కనిగిరి, పెదచెర్లోపల్లి, చంద్రశేఖరపురం, పామూరు, గిద్దలూరు, బేస్తవారిపేట, రాచర్ల, కొమరోలు, కంభం, అర్ధవీడు మండలాలు కొత్తజిల్లాలో ఉండనున్నాయి. అలాగే ఇతర జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేయనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం
మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం
Read Latest AP News And Telugu News