Share News

University New VCs: యూనివర్సిటీలకు వీసీల నియామకం

ABN , Publish Date - Oct 08 , 2025 | 09:06 PM

ఏపీలోని 5 విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులను నియమించారు. ఈ మేరకు గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆచార్య నాగార్జున వర్సిటీ వీసీగా వెంకట సత్యనారాయణరాజు సమంతపుడిని నియమించారు. అలాగే ..

University New VCs: యూనివర్సిటీలకు వీసీల నియామకం

అమరావతి: ఏపీలోని 5 విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులను నియమించారు. ఈ మేరకు గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆచార్య నాగార్జున వర్సిటీ వీసీగా వెంకట సత్యనారాయణరాజు సమంతపుడిని నియమించారు. అలాగే శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వీసీగా టాటా నర్సింగరావు, వైఎస్‌ఆర్‌ ఆర్కిటెక్చర్‌, ఫైన్‌ ఆర్ట్స్‌ వర్సిటీ వీసీగా బి.జయరామిరెడ్డి, జేఎన్‌టీయూ(విజయనగరం) వీసీగా విస్సాకోడేటి వెంకటసుబ్బారావు, యోగి వేమన విశ్వవిద్యాలయం(కడప) వీసీగా రాజశేఖర్‌ బెల్లంకొండను నియమించారు.


Also Read:

కెమిస్ట్రీలో ముగ్గురికి నోబెల్ ఫ్రైజ్..

మాజీ సీఎం జగన్‌పై కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఫైర్..

అభ్యర్థుల ఖరారుకు బీజేపీ కీలస సమావేశం

Updated Date - Oct 08 , 2025 | 09:06 PM