Share News

CM VishnuDevSai: నక్సలిజం కారణంగానే ఛత్తీస్‌గఢ్ వెనకబడింది: సీఎం

ABN , Publish Date - Dec 21 , 2025 | 08:19 PM

ప్రధాని మోదీ ఆశీర్వాదం వల్ల చత్తీస్‌గఢ్ సైతం అభివృద్దిలో పరుగులు తీస్తుందని ఆ రాష్ట్ర సీఎం విష్ణుదేవ్ సాయి తెలిపారు. కొన్ని దశాబ్దాలుగా నక్సలిజం కారణంగా ఛత్తీస్‌గఢ్ అభివృద్ధిలో వెనుక పడిందని చెప్పారు.

CM VishnuDevSai: నక్సలిజం కారణంగానే ఛత్తీస్‌గఢ్ వెనకబడింది: సీఎం
CM VishnuDevSai

రాజమండ్రి, డిసెంబర్ 21: ఆంధ్రప్రదేశ్‌, తమ రాష్ట్రం మధ్య మైత్రి ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నానని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి తెలిపారు. ఈ రెండు రాష్ట్రాల మధ్య దూరం తగ్గి.. మనుషులు కలిసేలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆదివారం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్‌పేయ్ విగ్రహాన్ని ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం విష్ణుదేవ్ సాయి మట్లాడుతూ.. తమ రాష్ట్రంలోని గ్రామాల్లో అటల్ కూడళ్లుగా పేర్లు పెడుతున్నట్లు చెప్పారు. వాజ్‌పేయ్ విగ్రహావిష్కరణ చేయడంతోపాటు ఈ సభలో తాను పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. డిసెంబర్ 25వ తేదీ అటల్ జీ జయంతి అని.. ఈ సందర్భంగా వర్చువల్‌గా అన్ని జిల్లాల్లో అటల్ పార్కులను ప్రారంభిస్తున్నామని ఆయన ప్రకటించారు.


ఈ దేశంలో సమర్ధ నాయకత్వం కారణంగా భారత్ నాలుగో స్థానానికి చేరిందని వివరించారు. ప్రధాని మోదీ ఆశీర్వాదం వల్ల చత్తీస్‌గఢ్ సైతం అభివృద్దిలో పరుగులు తీస్తుందన్నారు. అయితే కొన్ని దశాబ్దాలుగా నక్సలిజం కారణంగా ఛత్తీస్‌గఢ్ అభివృద్ధిలో వెనకపడిందని తెలిపారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా తీసుకున్న నిర్ణయాలు కారణంగా.. రాష్ట్రంలో నక్సలైట్లను రూపుమాపుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో అక్కడక్కడా నక్సలిజం ఉందన్నారు. దానిని సైతం పూర్తిగా రూపుమాపుతామని ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి ఈ సందర్భంగా విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

కృష్ణ చైతన్య ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల

ఈ పాలు తాగితే.. షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, అలర్జీ.. అన్ని దూరం

For More AP News And Telugu News

Updated Date - Dec 21 , 2025 | 08:47 PM