Vadde Sobhanadreeswara Rao: అభివృద్ధి పేరుతో పొలాలు లాక్కోవద్దు
ABN , Publish Date - Jul 21 , 2025 | 06:09 AM
అభివృద్ధి పేరుతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పచ్చని పంట పొలాలను ధ్వంసం..
ప్రభుత్వానికి మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు విజ్ఞప్తి
గుంటూరు కార్పొరేషన్, జూలై 20 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి పేరుతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పచ్చని పంట పొలాలను ధ్వంసం చేయాలనుకోవడంపై పునఃపరిశీలన చేసుకోవాలని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కరేడు భూముల వివాదం నేపథ్యంలో ‘అభివృద్ధి పేరుతో భూదోపిడీ’ అనే అంశంపై ఆదివారం గుంటూరు జనచైతన్య వేదిక హాలు లో చర్చాగోష్ఠి జరిగింది. శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. 5,500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న శ్రీసిటీలో 300లకు పైగా 30దేశాల కంపెనీలు కొనసాగుతుంటే.. 8,500 ఎకరాల పంట పొలాలను ఇండోసోల్ అనే ఒక్క కంపెనీకి ధారాదత్తం చెయ్యాలనుకునే కుటిల ప్రయత్నాన్ని విరమించుకోవాలన్నారు. వేలాది మంది కరేడు రైతుల పోరాటాన్ని అభినందించారు. ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యుడు సుంకర రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి రూ.42 వేల కోట్ల కేటాయిస్తే, ఇండోసోల్ కంపెనీకి రూ.46,429 కోట్ల ప్రజాధనాన్ని ప్రోత్సహకాలు, సబ్సిడీల రూపంలో ఇవ్వాలనుకోవడం ప్రజావ్యతిరేక చర్య అన్నారు. రైతుల నుంచి భూసేకరణ వల్ల ఆహార భద్రతకు విఘాతం కలుగుతుం దని మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రండి.. ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించుకుందాం: మంత్రి లోకేష్ పిలుపు
ఈ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చిస్తాం: కిరణ్ రిజిజు
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం
For More AndhraPradesh News And Telugu News