Indrakeeladri Temple: నాలుగోరోజు ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు
ABN , Publish Date - Sep 25 , 2025 | 11:38 AM
విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నాలుగో రోజైన ఈ రోజు, అమ్మవారు కాత్యాయనీ దేవి రూపంలో దర్శనమివ్వగా..భక్తులు ఉదయం నుంచే ఆలయానికి పెద్ద ఎత్తున పోటెత్తారు.
విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయం (Vijayawada Kanaka Durga Temple) వద్ద దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు ఉత్సవాల నాలుగో రోజు అమ్మవారు కాత్యాయనీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ క్రమంలో ఉదయం నుంచే ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
దీంతో అమ్మవారి దర్శనం కోసం వేలాదిగా భక్తులు బారులు తీరారు. ఉదయం 11 గంటల వరకే దాదాపు 50,000 మందికిపైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. ఎక్కడా అసౌకర్యం లేకుండా, భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు క్లూ లైన్‌లో శాశ్వత షెడ్లు ఏర్పాటు చేశారు. వాటర్ బాటిళ్లు, పాలు, మజ్జిగ ప్యాకెట్లు వితరణ చేస్తున్న వాలంటీర్లు ప్రతీ పాయింట్ దగ్గర పనిచేస్తున్నారు. భక్తుల కోసం మెడికల్ టీమ్స్, డాక్టర్లు, పారామెడిక్స్ సిబ్బంది కూడా విధుల్లో నిమగ్నమయ్యారు.
వాహనాల పార్కింగ్ నుంచి దర్శనం వరకూ భక్తులకు సహాయక బృందాలు సేవలందిస్తున్నాయి. ఈ క్రమంలో ట్రాఫిక్‌ను సజావుగా నిర్వహించేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి విశేష అలంకార దర్శనం కోసం అనేక ప్రాంతాల నుంచి భక్తులు విజయవాడకు తరలివస్తున్నారు. ప్రతిరోజూ అమ్మవారు ఓ విశిష్ట రూపంలో దర్శనమిస్తుండటంతో భక్తులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి