Raghurama Krishnam Raju: ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు
ABN , Publish Date - Sep 24 , 2025 | 10:39 AM
విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీదుర్గాదేవి ఆలయాన్ని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు సాంప్రదాయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు.
విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయం భక్తుల ప్రతీకగా నిలుస్తోంది. తాజాగా ఈ పవిత్ర ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు (Raghurama Krishnam Raju) దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయనకు ఆలయ అధికారులు సంప్రదాయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు రఘురామ కృష్ణంరాజుకు లడ్డు ప్రసాదం, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.
దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని డిప్యూటీ స్పీకర్ తెలిపారు. అన్నపూర్ణా దేవి అలంకరణలో అమ్మవారిని చూడటం తన అదృష్టమని, విజయవాడ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని ఈ సందర్భంగా అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అమ్మవారు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు రఘురామ తెలిపారు. దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ రాష్ట్రంలో ఉత్సాహాన్ని నింపాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈరోజు ఉపరాష్ట్రపతి ఈ ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకోనున్నారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి