Denduluru MLA Chintamaneni Prabhakar : అధికారం ముసుగులో చేసిన అరాచక దాడులు మరిచారా?
ABN , Publish Date - Aug 23 , 2025 | 05:24 PM
అధికారం ముసుగులో చేసిన అరాచక దాడులు మరిచారా? అంటూ వైసీపీ నేతలపై దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మండిపడ్డారు. రౌడీలకు, దోపిడీదారులకు తమ అండ దండ ఉందని జగన్..
అమరావతి, ఆగస్టు 23 : అధికారం ముసుగులో చేసిన అరాచక దాడులు మరిచారా? అంటూ వైసీపీ నేతలపై దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మండిపడ్డారు. వైసీపీకి ప్రజలు రాజకీయ గోరి కట్టే రోజు దగ్గరలోనే ఉన్నాయని చింతమనేని అన్నారు. దోపిడీదారులకు తమ అండ దండ ఉందని జగన్ నేతృత్వంలో వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారన్నారు.
'వైఎస్ జగన్‌కు, అతని అనుచరులకు కాల్చి ఎక్కడ వాతలు పెట్టకూడదో అక్కడ ప్రజలు వాతలు పెట్టినా బుద్దిరాలేదు. తాను చేసిన దోపిడీకి భార్యను కేసులో ఇరికించి పారిపోయిన పేర్ని నాని, చంద్రబాబు.. పవన్ కళ్యాణ్.. లోకేష్‌లపై నోరూపారేసుకుంటున్నాడు. దోచుకోవడం, దోపిడీ చేయటమే వైసీపీ సిద్దాంతం. అధికారం ముసుగులో చేసిన అరాచక దాడులు మరిచారా? చేపల దొంగతానినికి పాల్పడ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి మద్దతుగా జగన్ అనుచరవర్గమంతా వచ్చింది. కొల్లేరుకు వలస పక్షులు వచ్చినట్లు అప్పుడప్పుడు దెందులూరుకు అబ్బయ్య చౌదరి వస్తాడు.' అంటూ చింతమనేని చురకలంటించారు.
ఇవి కూడా చదవండి..
ప్రధానిపై సోషల్ మీడియాలో కామెంట్స్.. తేజస్వి యాదవ్‌పై మహారాష్ట్ర పోలీసుల కేసు
అనిల్ అంబానీ నివాసాల్లో CBI సోదాలు
For More National News And Telugu News