Share News

BJP State President : కొత్త అధ్యక్షుడెవరు?

ABN , Publish Date - Jan 22 , 2025 | 05:29 AM

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరికి అవకాశం లభిస్తుందనే అంశంపై పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.

 BJP State President : కొత్త అధ్యక్షుడెవరు?

  • రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో చర్చ

  • రేసులో సుజనా, పార్థ, విష్ణు తదితరులు

అమరావతి, జనవరి 21(ఆంధ్రజ్యోతి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరికి అవకాశం లభిస్తుందనే అంశంపై పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి 2023 జూలైలో ఈ బాధ్యతలు చేపట్టారు. ఈ నెలాఖరులోపు కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవలసి ఉంది. దానికి ముందే పలు రాష్ట్రాల అధ్యక్షుల ఎంపిక జరగాలి. ఈ క్రమంలో ఈ నెలాఖరులోగా కొత్త అధ్యక్షుడిని నియమించడం ఖాయమని తెలుస్తోంది. ఈ పదవి కోసం దాదాపు పది మంది పోటీ పడుతున్నారు. అందులో... విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనాచౌదరి, ఆదోని ఎమ్మెల్యే డాక్టర్‌ పార్థసారథి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి పీవీఎన్‌ మాధవ్‌, కోస్తా నుంచి పాకా సత్యనారాయణ లాంటి వారిని పరిగణనలోకి తీసుకోవచ్చంటున్నారు. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, నెల్లూ రు జిల్లాకు చెందిన సురేశ్‌రెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. విష్ణువర్ధన్‌ రెడ్డి పేరును పొరుగు రాష్ట్రానికి చెందిన ఒక కేంద్ర మంత్రి సిఫారసు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తనకు పొత్తులో సీటు దక్కలేదని, రాష్ట్ర అధ్యక్ష పదవి అప్పగించాలని జాతీయ లేబర్‌ బోర్డు చైర్మన్‌ వల్లూరు జయప్రకాశ్‌ నారాయణ ఢిల్లీ పెద్దలకు విన్నవించినట్లు సమాచారం. ఇటీవల విశాఖలో కోర్‌ కమిటీ భేటీలో రాష్ట్ర పార్టీ సహ ఇన్‌చార్జి శివ ప్రకాశ్‌ పార్టీ ముఖ్యులతో చర్చించారు. ఢిల్లీ ఎన్నికల్లో నిమగ్నమైన అగ్రనేతలు ‘కొత్త అధ్యక్షుడి నియామకంపై మీ అభిప్రాయాలు పంపండి’ అని చెప్పినట్లు తెలుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి

Palla Srinivas: టీడీపీ కోటి సభ్యత్వం.. ఆ ముగ్గురిదే ఘనత

Chandrababu: వీర జవాన్ కార్తీక్ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం..

CM Chandrababu: దిగ్గజ కంపెనీల అధిపతులతో సమావేశాలు.. చంద్రబాబు షెడ్యూల్ ఇదే

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 22 , 2025 | 05:30 AM