CPI Leader K. Ramakrishna : పేదల సాగులో ఉన్న దేవాలయ భూములకుశాశ్వత యాజమాన్య హక్కు పత్రాలు ఇవ్వాలి
ABN , Publish Date - Jan 22 , 2025 | 04:28 AM
అంతర్వేదిలో వివిధ దేవాలయాల భూములను తరతరాలుగా సాగు చేసుకుంటున్న పేదలకు శాశ్వత యాజమాన్య హక్కు పత్రాలు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ....
రెవెన్యూ మంత్రికి వినతిపత్రం అందజేసిన సీపీఐ రామకృష్ణ
అమరావతి, జనవరి 21(ఆంధ్రజ్యోతి): అంతర్వేదిలో వివిధ దేవాలయాల భూములను తరతరాలుగా సాగు చేసుకుంటున్న పేదలకు శాశ్వత యాజమాన్య హక్కు పత్రాలు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం ఆయన రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను కలిసి ఈమేరకు వినతిపత్రం అందజేశారు. అంతర్వేది, కేసుదాసుపాలెం, గొంది, శృంగవరప్పాడు గ్రామాల్లో వందలాది మంది నిరుపేదలు తరతరాలుగా దేవాలయాల భూములను సాగు చేసుకుంటున్నారని, కొంతమంది ఇళ్లు కట్టుకుని నివసిస్తున్నారని తెలిపారు. కడప జిల్లాలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, ఇంటి పట్టాలు ఇవ్వాలని, శ్రీ సత్యసాయి జిల్లాలోని నిడమామిడి జంగం భూమిలో 22 గ్రామాలకు చెందిన సుమారు 1,000 మందికి పట్టాలు మంజూరు చేయాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించి పేదలకు న్యాయం చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు రామకృష్ణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, ఏఐవైఎఫ్ కడప జిల్లా ప్రధాన కార్యదర్శి గంగా సురేశ్ తదితరులు మంత్రిని కలిశారు.
ఈ వార్తలు కూడా చదవండి
Palla Srinivas: టీడీపీ కోటి సభ్యత్వం.. ఆ ముగ్గురిదే ఘనత
Chandrababu: వీర జవాన్ కార్తీక్ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం..
CM Chandrababu: దిగ్గజ కంపెనీల అధిపతులతో సమావేశాలు.. చంద్రబాబు షెడ్యూల్ ఇదే
Read Latest AP News And Telugu News