Share News

CM Chandrababu Tweet: పరిశ్రమల వృద్ధితో రాష్ట్రాభివృద్ధి సాధ్యం: సీఎం

ABN , Publish Date - Oct 16 , 2025 | 07:06 PM

ఏపీ ప్రజలకు రెండింతలు ఆనందాన్ని ఇచ్చే రోజు ఇదంటూ సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. రాయలసీమలో సూపర్ జీఎస్టీ... సూపర్ సేవింగ్స్ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

CM Chandrababu Tweet: పరిశ్రమల వృద్ధితో రాష్ట్రాభివృద్ధి సాధ్యం: సీఎం
CM Chandrababu Naidu

కర్నూలు: జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన విజయవంతమైంది. ఈ టూర్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు ప్రధాని మోదీ. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఓ ట్వీట్ చేశారు. పరిశ్రమల అభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందంటూ ముఖ్యమంత్రి ట్వీట్ లో పేర్కొన్నారు.


'ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రెండింతలు ఆనందాన్ని ఇచ్చే రోజు ఈ రోజు. ముఖ్యంగా రాయలసీమలో సూపర్ జీఎస్టీ(Super GST)... సూపర్ సేవింగ్స్(Super Savings) కార్యక్రమాన్ని కర్నూలులో నిర్వహించాం. ఈ సందర్భంగా రూ.13,430 కోట్ల నిధులతో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయి. ఈ ప్రాజెక్టులలో పారిశ్రామిక రంగానికి చెందినవే కాకుండా విద్యుత్, రోడ్లు, రైల్వే, రక్షణ ఉత్పత్తులు, పెట్రోలియం, సహజ వాయువులకు చెందినవి ఉన్నాయి.


ఈ రంగాల్లో జరిగిన అభివృద్ధి వల్ల పరిశ్రమల వృద్ధి జరిగి రాష్ట్రం మొత్తం సమతుల్యమైన అభివృద్ధి సాధ్యం అవుతుంది. ఈ కీలక ప్రాజెక్టులకు ప్రధానే స్వయంగా వచ్చి ప్రారంభోత్సవం, శంకుస్ధాపనలు చేయడం పట్ల ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రధాని ఈ రోజు ఏపీకి వచ్చి ఏపీ వాసుల్లో ఆనందం కలుగజేశారు' అంటూ ట్వీట్ చేశారు. ఏపీ సేస్ థ్యాంక్యూ మోదీ(#APSaysThankYouModi) అనే హ్యాష్ ట్యాగ్ తో సీఎం చంద్రబాబు (Chandrababu Tweet) ఈ ట్వీట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

వామ్మో.. మాజీ ప్రియుడిపై ఇలా కూడా పగ తీర్చుకుంటారా? ఏం జరిగిందంటే..

మీ తెలివికి పరీక్ష.. ఈ ఫొటోలో ఏనుగు ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Oct 16 , 2025 | 09:37 PM