Chandrababu: రెండు జీతాలు అందుకొంటూ.. ఒక్కరే పిల్లలు ఉంటే చాలని..
ABN , Publish Date - Mar 11 , 2025 | 09:34 PM
Chandrababu: జనబా పెరుగుదలపై అందరూ నిశ్శబ్దం వీడి.. చర్చ జరగాలని సీఎం చంద్రబాబు పిలుపు నిచ్చారు. గతంలో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఎన్నికల్లో పోటీ చేయకుండా తాను చట్టం చేశానని.. కానీ ప్రస్తుతం ఆ చట్టాన్ని తీసేశానన్నారు. ఎక్కువ మంది పిల్లలను కనాలని తానే చెబుతున్నానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

అమరావతి, మార్చి 11: జనాభా తక్కువగా ఉండటం వల్ల పార్లమెంటు సీట్లు తగ్గుతాయని భావన ప్రస్తుతం ఉందని.. కానీ తాను అలా ఆలోచించటం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మనకు దేశం ముఖ్యమని.. ఆ తర్వాతే రాష్ట్రమని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం ఏపీ ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో ‘పాపులేషన్ డైనమిక్ డెవలప్‌మెంట్’ సదస్సు జరిగింది. ఈ సదస్సు ముగింపు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
Also Read: త్రిభాష విధానం అమలు.. మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. బీహార్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల వల్ల మన జనాభాకు ఇబ్బంది లేకుండా పోయిందన్నారు. జపాన్, జర్మనీ వంటి దేశాలు భారతీయుల కోసం ఎదురు చూస్తున్నాయని తెలిపారు. ప్రపంచంలో ఏ కంపెనీని అయినా భారతీయులు రూల్ చేయాలన్నదే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. దక్షిణ భారతదేశం మేల్కొవలసిన సమయం వచ్చిందన్నారు. జనాభా పెరుగుదల గురించి ఆలోచించాలంటూ ఈ సందర్భంగా ప్రజలకు ఆయన కీలక సూచన చేశారు. ఇక టోటల్ ఫెర్టిలిటీ రేట్ సైతం 1.5 నుంచి 2.1కు పెరగాలని ఆరోగ్య రంగానికి చెందిన నిపుణులు సూచిస్తున్నారని గుర్తు చేశారు.
Also Read: పోసానికి బెయిల్ మంజూరు
కొత్త అంశాన్ని ఏదైనా త్వరగా ఆమలు చేయటం ఆంధ్రా వారికి అలవాటని సీఎం చంద్రబాబు చెప్పారు. శిశు మరణాల విషయంలో దేశ సగటు కంటే మనం తక్కువగా ఉన్నామన్నారు. సాధారణ ప్రసవాలు పెరగాలి.. సిజేరియన్స్ తగ్గించాలని ఆయన ఆకాంక్షించారు. అందులోభాగంగానే పాపులేషన్ మేనేజ్‌మెంట్ మీద సదస్సు నిర్వహిస్తున్నామని వివరించారు. దంపతులు రెండు జీతాలు అందుకొంటూ.. ఒక్కరే పిల్లలు ఉంటే చాలని చాలా మంది భావిస్తున్నారన్నారు.
Also Read: చింతకాయల వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
జనాభా పెరుగుదల విషయంలో నిశ్శబ్దం వీడాలి.. అందరూ చర్చించాలని సీఎం చంద్రబాబు పిలుపు నిచ్చారు. ప్రభుత్వం సైతం జనాభా పెరుగుదలకు చర్యలు చేపడుతోందన్నారు. గతంలో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఎన్నికల్లో పోటీ చేయకుండా తాను చట్టం చేశానని.. కానీ ప్రస్తుతం ఆ చట్టాన్ని తీసేశానన్నారు. ఎక్కువ మంది పిల్లలను కనాలని తానే చెబుతున్నానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
Also Read: నా చేతిలో కత్తి పెట్టి..
తల్లికి వందనం కార్యక్రమం ఎందరు పిల్లలు ఉన్నా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఎన్ని కాన్పులకైనా ప్రసూతి సెలవులు మంజూరు చేస్తామని ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు సూచించారు. మన కుటుంబ వ్యవస్థ ప్రపంచంలో కల్లా అద్భుతమని ఆయన అభివర్ణించారు. ఇక్కడ పిల్లలు, తల్లితండ్రులు మధ్య బాండింగ్ వుంటుందన్నారు. అదే ఇతర దేశాల్లో నా పిల్లలు, నీ పిల్లలు, మన పిల్లలు అన్నట్లుగా కుటుంబ వ్యవస్థ వుంటుందన్నారు. ఏపీ పాపులేషన్ ప్రస్తుతం ఆధార్ కార్డు ఆధారంగా 4.96 కోట్లుగా ఉందని సీఎం చంద్రబాబు వివరించారు. పీ 4 విధానాన్ని ఉగాది నుంచి అమలు చేస్తామని ప్రకటించారు.
మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: వైసీపీ భూ కుంభకోణాన్ని ఎండగట్టిన ఎంపీ
Also Read: అందంగా ఉందని ప్రియురాలిని చంపేశాడు..
For AndhraPradesh News And Telugu News