Share News

CM Chandrababu: ప్రజలు మావైపే ఉన్నారనేందుకు ఇదే నిదర్శనం..

ABN , Publish Date - Mar 05 , 2025 | 08:52 PM

కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ రాజకీయ పరిణామాలపై కేంద్ర హోమంత్రి అమిత్‌ షాతో భేటీ అయిన సీఎం.. అనంతరం మీడియాతో మాట్లాడారు.

CM Chandrababu: ప్రజలు మావైపే ఉన్నారనేందుకు ఇదే నిదర్శనం..

ఢిల్లీ: కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ రాజకీయ పరిణామాలపై కేంద్ర హోమంత్రి అమిత్‌ షాతో భేటీ అయిన సీఎం.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.."రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీలను కైవసం చేసుకున్నాం. ప్రజలు మావైపే ఉన్నారనేందుకు ఈ ఫలితాలే నిదర్శనం. అభివృద్ధి సంక్షేమమే మా ప్రధాన ధ్యేయం. ఇవాళ(బుధవారం) ఢిల్లీలో రెండు కీలక సమావేశాలు జరిగాయి. ఏపీ రాజకీయ పరిణామాలపై అమిత్‌ షాతో చర్చించాం. ఎన్డీఏ ఎలా ముందుకెళ్లాలనే అంశంపైనా చర్చించాం. ఏపీ ల్యాండ్‌ గ్రాబింగ్‌ బిల్లు అంశంపై చర్చ జరిగింది. భూములకు సంబంధించి కంప్యూటరీకరణలో కొన్ని సమస్యలు వచ్చాయి. గతంలో ప్రైవేట్‌ భూములను 22Eలో చేర్చారు. గతంలో అటవీ భూములు కూడా ఆక్రమించారు’’.


‘‘గుజరాత్‌లో ల్యాండ్‌ గ్రాబింగ్‌ బిల్లు విజయవంతంగా అమలైంది. ఏపీలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతాం. ఏపీలో గంజాయి అనే మాట వినిపించకుండా చేసి, యువతను సన్మార్గంలో నడిపించేలా చర్యలు తీసుకుంటాం. ల్యాండ్‌ గ్రాబింగ్‌ బిల్లులో పట్టణ, గ్రామీణ భూములు ఉన్నాయి. ల్యాండ్‌ గ్రాబింగ్‌ బిల్లు వచ్చాక నేరాలపై పీడీ కేసులు పెట్టనున్నాం. గంజాయి, డ్రగ్స్‌ నిర్మూలనకు మరో బిల్లు తీసుకొస్తాం. గత వైసీపీ హయాంలో పెద్దఎత్తున అధికార దుర్వినియోగం జరిగింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆర్థిక నేరాలు జరిగాయి. రూ.10 లక్షల కోట్ల అప్పులు సహా బకాయిలు మిగిల్చారు. గతంలో FRBM పరిమితులు కూడా దాటిపోయారు’’.


’’ఏపీలో 12.94 శాతం వృద్ధి రేటు సామర్థ్యం కాగా.. ఈ ఏడాది 15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకున్నాం. పోలవరం-బనకచర్ల అనుసంధానంపైనా చర్చించాం. వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం జరగాలి. నదుల అనుసంధానంతో రాయలసీమకు ప్రయోజనం చేకూరనుంది. సముద్రంలోకి వృథాగా పోయే నీటిని పోలవరం ప్రాజెక్టుకు వాడుకోవాలని ఆలోచన చేస్తున్నాం. సంపద సృష్టించలేని వారికి పంపిణీ చేసే హక్కు లేదు. 57 శాతం ఓటు బ్యాంకు, 93 శాతం స్ట్రైక్‌ రేట్‌తో ఎన్డీఏ కూటమికి ప్రజలు పట్టం కట్టారని’’ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Breaking News: వివేకా హత్య కేసులో బిగ్ ట్విస్ట్..

Nadendla Manohar: ఫస్ట్ ఇది నేర్చుకో.. జగన్‌కు నాదెండ్ల మనోహర్ స్ట్రాంగ్ కౌంటర్..

Updated Date - Mar 05 , 2025 | 09:43 PM