Share News

Tirumala: టీటీడీ కీలక నిర్ణయం.. ఆ కేసు నుంచి సుబ్రహ్మణ్యస్వామి తొలగింపు..

ABN , Publish Date - Feb 03 , 2025 | 09:26 PM

ఆంధ్రప్రదేశ్: వైసీపీ ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం ముద్రణలో అన్యమత ప్రచారం జరుగుతున్న అంశంపై సోషల్ మీడియాతోపాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ విస్తృతంగా కథనాలు ప్రసారం అయ్యాయి. ఈ కథనాలు అన్నీ మీడియాల్లో వచ్చినప్పటికీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపైనే అప్పటి జగన్ సర్కార్ కక్షగట్టి పరువు నష్టం దావా వేసింది.

Tirumala: టీటీడీ కీలక నిర్ణయం.. ఆ కేసు నుంచి సుబ్రహ్మణ్యస్వామి తొలగింపు..
TTD

తిరుపతి: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో వైసీపీ (YSRCP) హయాంలో అరాచకాలకు అంతే లేకుండా పోయింది. టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన పలువురు నేతలను వేధించడమే పనిగా పెట్టుకుంది. అలాగే నిజాన్ని నిర్భయంగా రాసే పత్రికలు, టీవీ ఛానళ్లపైనా అక్కసు వెళ్లగక్కింది. ప్రశ్నించే వారిపై లేనిపోని కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేసింది. అయితే జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ముద్రణలో అన్యమత ప్రచారం జరుగుతున్న అంశంపై సోషల్ మీడియాతోపాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ విస్తృతంగా కథనాలు ప్రసారం అయ్యాయి.


ఈ కథనాలు అన్నీ మీడియాల్లో వచ్చినప్పటికీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపైనే అప్పటి జగన్ సర్కార్ కక్షగట్టి పరువు నష్టం దావా వేసింది. టీటీడీ తరఫున సుబ్రహ్మణ్యస్వామిని న్యాయవాదిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే అప్పట్నుంచీ ప్రతి వాయిదాకు టీటీడీ నిధులు భారీగా ఖర్చు అవుతున్నట్లు ప్రస్తుత పాలకవర్గం గుర్తించింది. సుబ్రహ్మణ్యస్వామి ప్రత్యేక విమానంలో వచ్చివెళ్లేందుకు లక్షలాది రూపాయలు వ్యయం అవుతోందని భావించారు. ఈ మేరకు పరువునష్టం కేసు నుంచి సుబ్రహ్మణ్యస్వామిని తొలగిస్తూ టీటీడీ తాజాగా నిర్ణయం తీసుకుంది.


ఈ వార్తలు కూాడా చదవండి:

Manoj Kumar Sahu: వాల్తేర్ డివిజన్‌లో అధికంగా రైళ్లు కేటాయింపు

Ashwini Vaishnaw: ఏపీకి మరో గుడ్ న్యూస్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్

Updated Date - Feb 03 , 2025 | 09:28 PM