Share News

Bhanuprakash Reddy On TTD Scam: పరకామణిలో భారీ చోరీ చేసిన సంచలనం వీడియో.. వైసీపీ నేతలు దోచుకుని..

ABN , Publish Date - Sep 20 , 2025 | 02:13 PM

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిధిలోని పరకామణి విభాగంలో జరిగిన భారీ చోరీపై టీటీడీ సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఒక వీడియోను విడుదల చేసిన ఆయన..

Bhanuprakash Reddy On TTD Scam: పరకామణిలో భారీ చోరీ చేసిన సంచలనం వీడియో.. వైసీపీ నేతలు దోచుకుని..
Bhanuprakash Reddy On TTD Scam

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిధిలోని పరకామణి విభాగంలో జరిగిన భారీ చోరీపై టీటీడీ సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఒక వీడియోను విడుదల చేసిన ఆయన, పరకామణిలో రవికుమార్‌ అనే వ్యక్తి దోచుకున్న దృశ్యాలు అందులో ఉన్నాయని తెలిపారు. దొంగతనానికి వైసీపీ నాయకులు, అధికారుల సహకారం ఉన్నట్లు భానుప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు.


100 కోట్లు దోచుకున్నారు

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ దొంగతనాలు జరిగినాయని, ఒక్కటీటీడీలోనే రూ.100 కోట్ల వరకు దోచుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ కేసులో కీలకంగా ఉన్న ఓ అధికారి అప్రూవర్‌గా మారనున్నారని, త్వరలోనే అసలైన దోషుల పేర్లు బయటకు వస్తాయని భానుప్రకాష్ తెలిపారు. టీటీడీ వ్యవహారాల్లోని అవినీతిపై మరింత దర్యాప్తు జరగవలసిన అవసరం ఉందని భావిస్తున్నారు.


పరకామణిలో దొంగతనంపై హైకోర్టు సీరియస్‌ అయ్యిందని, దొంగతనం కేసును హైకోర్టు CIDకి అప్పగించిందని టీటీడీ సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి తెలిపారు. రవికుమార్‌కు ప్రాణహాని ఉందని వ్యాఖ్యానించారు. సీఐడీ విచారణ జరిగితే సంచలన విషయాలు బయటికొస్తాయన్నారు. పరకామణిలో రవికుమార్‌ దోచుకుంటే వైసీపీ నేతలు, అధికారులు ఆ సొమ్మును పంచుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కోట్లాది రూపాయలను రియల్‌ ఎస్టేట్‌లో పెట్టారన్నారు. అప్పట్లో టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి ఉన్నారని, చోరీ అంశంపై భూమన సమాధానం చెప్పాలని భానుప్రకాష్‌రెడ్డి డిమాండ్ చేశారు.


Also Read:

ఆపిల్, గూగుల్ కాదు.. అత్యధిక హెచ్‌1బీ వీసా ఉద్యోగులను కలిగిన కంపెనీ ఇదే..

దానిమ్మ ధర నేలచూపులు.. టన్ను రూ.60వేలలోపే

For More Latest News

Updated Date - Sep 20 , 2025 | 03:02 PM