Share News

H-1B visa India: ఆపిల్, గూగుల్ కాదు.. అత్యధిక హెచ్‌1బీ వీసా ఉద్యోగులను కలిగిన కంపెనీ ఇదే..

ABN , Publish Date - Sep 20 , 2025 | 01:35 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్‌1బీ వీసా ఫీజును భారీగా పెంచడంతో టెక్ కంపెనీలన్నీ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. హెచ్‌1బీ వీసా ఫీజును ట్రంప్ ఏకంగా మిలియన్ డాలర్లకు పెంచేశారు. దీంతో హెచ్1బీ వీసా ఉద్యోగులను కలిగి ఉన్న కంపెనీలన్నింటిపై అదనపు భారం ఓ స్థాయిలో ఉంటుంది.

H-1B visa India: ఆపిల్, గూగుల్ కాదు.. అత్యధిక హెచ్‌1బీ వీసా ఉద్యోగులను కలిగిన కంపెనీ ఇదే..
most H-1B visa workers

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్‌1బీ వీసా ఫీజును భారీగా పెంచడంతో టెక్ కంపెనీలన్నీ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. హెచ్‌1బీ వీసా ఫీజును ట్రంప్ ఏకంగా మిలియన్ డాలర్లకు పెంచేశారు. దీంతో హెచ్1బీ వీసా ఉద్యోగులను కలిగి ఉన్న కంపెనీలన్నింటిపై అదనపు భారం ఓ స్థాయిలో ఉంటుంది. భారత్‌కు చెందిన పలు టెక్ సంస్థలు అత్యధికంగా హెచ్1బీ వీసాలతోనే అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి (most H-1B visa workers).


భారత టెక్ సంస్థలతో పాటు అమెరికాకు చెందిన పలు టెక్ కంపెనీలు కూడా హెచ్1బీ వీసాలతో ఎక్కువ మంది భారతీయులను నియమించుకుంటున్నాయి (top H-1B employer). యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ డేటా ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరం జూన్ 30 వరకు అమెరికా జారీ చేసిన మొత్తం వీసాల్లో అమెజాన్ సంస్థ ఎక్కువగా దక్కించుకుంది. అమెజాన్ తర్వాత ఈ జాబితాలో ఇన్ఫోసిస్ రెండో స్థానంలో ఉంది. ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా వంటి సంస్థలు కూడా భారీగా హెచ్1బీ వీసాలను కలిగిన ఉద్యోగులతో పని చేయించుకుంటున్నాయి (U.S. work visa stats).


2024-25 ఆర్థిక సంవత్సరంలో పలు కంపెనీలకు దక్కిన హెచ్1బీ వీసాలు..

  1. అమెజాన్ - 10,044

  2. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్- 5,505

  3. మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్- 5,189

  4. మెటా ప్లాట్‌ఫారమ్‌- 5123

  5. ఆపిల్ ఇంక్- 4,202

  6. గూగుల్ - 4,181

  7. కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్ - 2,493

  8. జేపీ మోర్గాన్ చేజ్ అండ్ కో - 2,440

  9. వాల్‌మార్ట్ అసోసియేట్స్ ఇంక్ - 2,390

  10. డెలాయిట్ కన్సల్టింగ్ - 2353


ఇవి కూడా చదవండి:

హెచ్‌1బీ ఉద్యోగులకు ట్రంప్ గోల్డ్, ప్లాటినం, కార్పొరేట్ గోల్డ్ కార్డులు.. ఏమిటివి?

లక్ష డాలర్లు కడితేనే అడుగుపెట్టండి.. ట్రంప్ వింత కండీషన్..


మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 20 , 2025 | 02:01 PM