Share News

Kumbh Mela : ఆటోలో మహా కుంభమేళాకు..!

ABN , Publish Date - Feb 03 , 2025 | 05:09 AM

చిత్తూరు జిల్లాకు చెందిన నలుగురు యువకులు ఆటోను ఆశ్రయించారు. బంగారుపాళ్యం మండలం గుండ్లకట్టమంచి గ్రామానికి చెందిన వీరు జనవరి 27న కాణిపాకంలో దర్శనం చేసుకుని..

Kumbh Mela : ఆటోలో మహా కుంభమేళాకు..!

  • అటునుంచి వారాణసీకి ప్రయాణం

  • బంగారుపాళ్యం యువకుల సాహసం

  • సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌

చిత్తూరు, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): మహా కుంభమేళాలో పవిత్ర స్నానాలు చేయడానికి చిత్తూరు జిల్లాకు చెందిన నలుగురు యువకులు ఆటోను ఆశ్రయించారు. బంగారుపాళ్యం మండలం గుండ్లకట్టమంచి గ్రామానికి చెందిన వీరు జనవరి 27న కాణిపాకంలో దర్శనం చేసుకుని సీఎన్‌జీ ఆటోలో ప్రయాణం ప్రారంభించారు. తిరుపతి, కడప, కర్నూలు, నాగ్‌పూర్‌, జబల్పూర్‌, రేవా మీదుగా ప్రయాగ్‌రాజ్‌ కుంభమేళా ప్రాంగణానికి 29న ఉదయం చేరుకున్నారు. అక్కడినుంచి 30న వారాణాసి కూడా వెళ్లారు. అనంతరం ఫిబ్రవరి 1న తిరుగు ప్రయాణమయ్యారు. సోమవారం రాత్రికి వీరు చిత్తూరుకు చేరుకునే అవకాశం ఉంది. సీఎన్‌జీ ఆటో కావడంతో 40 కిలోమీటర్ల మైలేజ్‌ ఇచ్చిందని, రూ.20 వేలల్లో యాత్రను ముగించుకున్నామని, ఎక్కడా గదులు తీసుకోలేదని ఆ యువకులు ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. ఆటోలో వెనుక సీటును తొలగించి పరుపును ఏర్పాటు చేసుకుని, ముగ్గురు పడుకోవడం, ఒకరు డ్రైవింగ్‌ చేయడంతో ప్రయాణం సాఫీగా సాగిందని తెలిపారు. వీరిలో సాయి స్వర్ణకుమార్‌ చిత్తూరు టిడ్కోలో కాంట్రాక్టు ఏఈగా పనిచేస్తుండగా.. నాగరాజు ఆటో ఓనర్‌, మనోజ్‌, రెడ్డిప్రసాద్‌ డిగ్రీ విద్యార్థులు. వీరి ప్రయాణం వీడియో సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేయడంతో 12 లక్షల మందికి పైగా వీక్షించారు.


ఈ వార్తలు కూడా చదవండి

Drunk Man : ముద్రగడ నివాసంలో ఓ తాగుబోతు భీభత్సం...

Botsa Satyanarayana: ఉత్తరాంధ్రతోపాటు సీమకు అన్యాయం

Kondapalli Srinivas: అద్భుతం.. అస్సలు ఊహించలేదు.. బడ్జెట్‌పై మంత్రి కీలక వ్యాఖ్యలు

Read Latest AP News and Telugu News

Updated Date - Feb 03 , 2025 | 05:09 AM