Share News

BJYM Protest: కాంగ్రెస్‌ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లిన యువమోర్చా

ABN , Publish Date - May 01 , 2025 | 03:42 AM

బీజేపీ యువమోర్చా నాయకులు, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలపై కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేయడానికి యువమోర్చా దాడి చేశారు. ఈ దాడిని నిరసిస్తూ షర్మిల, పార్టీ కార్యకర్తలతో కలసి నిరసన తెలిపారు, దాడికి దిగిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు

BJYM Protest: కాంగ్రెస్‌ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లిన యువమోర్చా

  • పీసీసీ అధ్యక్షురాలిపై కోడిగుడ్లు, టమాటాలతో దాడికి యత్నం

  • దాడికి దిగిన వారిని అరెస్టు చేయాలంటూ షర్మిల ధర్నా

విజయవాడ(వన్‌టౌన్‌), ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ యువమోర్చా నాయకులు నగరంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంపై దాడికి ప్రయత్నించారు. బుధవారం గవర్నర్‌పేటలోని ఆంధ్రరత్న భవన్‌లో కార్యకర్తలతో సమావేశం అనంతరం కార్యాలయం ఆవరణలో షర్మిల మీడియాతో మాట్లాడారు. అదే సమయంలో యువమోర్చా దాడికి యత్నించింది. అక్కడే ఉన్న కాంగ్రెస్‌ నాయకులు, టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది వారిని అడ్డుకొన్నారు. ఈ దాడిని నిరసిస్తూ షర్మిల పార్టీ కార్యాలయ ప్రాంగణంలోనే బైఠాయించి నిరసన తెలిపారు. ప్రధాని మోదీ పర్యటనను పురస్కరించుకొని బుధవారం పీసీసీ అధ్యక్షురాలు మీడియాతో మాట్లాడారు. రాజధాని నిర్మాణం కోసం రూ.లక్షన్నర కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 2015లో నీళ్లు, మట్టితో అమరావతికి వచ్చిన ప్రధాని... ఇప్పుడు ఆంధ్రకు సున్నం కొట్టేందుకు వస్తున్నారని విమర్శించారు.


మోదీ దత్తపుత్రుడు జగన్‌.. అమరావతిని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. సమావేశం అనంతరం సాయంత్రం 4 గంటలకు తిరిగి గన్నవరం వెళ్లే సమయంలో బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు మిట్టా వంశీ ఆధ్వర్యంలో పలువురు నాయకులు, కార్యకర్తలు ఆంధ్రరత్న భవన్‌కు చేరుకున్నారు. భవనంలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. షర్మిలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమవెంట తెచ్చుకున్న కోడిగుడ్లు, టమోటాలతో దాడి చేయబోయారు. దీనిని గమనించిన కాంగ్రెస్‌ నాయకులు, టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగింది. దాడికి దిగిన యువమోర్చా నాయకులు, కార్యకర్తలను గవర్నర్‌పేట పోలీసులకు అప్పగించారు. ఈ దాడిని నిరసిస్తూ షర్మిల పార్టీ నాయకులతో కలసి కార్యాలయం ప్రాంగణంలోనే నిరసన తెలిపారు. దాడికి ప్రయత్నించిన వారిపై కేసులు నమోదు చేసి, అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.


హౌస్‌ అరెస్టుపై షర్మిల ఆగ్రహం

ప్రధాని మోదీ వస్తున్న నేపథ్యంలో షర్మిలను హౌస్‌ అరెస్టు చేసేందుకు పోలీసులు బుధవారం కృష్ణాజిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ఎస్‌ఎల్‌వీలోని ఆమె నివాసానికి వచ్చారు. అప్పటికే ఆమె విజయవాడ కాంగ్రెస్‌ పార్టీ ఆఫీ్‌సకు వెళ్లేందుకు బయలుదేరారు. పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో ఆమె, వారితో వాగ్వివాదానికి దిగారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్ర ప్రజల సమస్యలపై మాట్లాడే హక్కు మాకు లేదా? అమరావతి రాజధానిపై కమిటీ వేస్తే హౌస్‌ అరెస్టు చేయిస్తారా?’ అని ప్రశ్నించారు.


Also Read:

సామ్ కర్రన్ సూపర్ ఇన్నింగ్స్.. ఛాహల్ హ్యాట్రిక్

రిటైర్మెంట్‌పై బాంబు పేల్చిన ధోని

ఇలాంటి దోపిడీ ఎక్కడైనా చూశారా..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - May 01 , 2025 | 03:42 AM