BJP: కోటి సంతకాల సేకరణ కాదు.. రామకోటి రాస్తే మేలు
ABN , Publish Date - Nov 28 , 2025 | 11:45 AM
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కోటి సంతకాల సేకరణ కాదు.. రామకోటి రాస్తే మేలు.. అంటూ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుడిసె దేవానంద్ ఎద్దేదా చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపి భక్తుల మనో భావాలని దెబ్బతీశారని ఆయన ఆరోపించారు.
- వైసీపీపై మండిపడ్డ బీజీపీ నాయకుడు దేవానంద్
అనంతపురం: వైద్య కళాశాలల పీపీపీ విధానంపై వైసీపీ నాయకులు కోటి సంతకాల సేకరణ బదులు రామకోటి రాస్తే మేలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుడిసె దేవానంద్(Gudise Dayanand) ఎద్దేవా చేశారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలోనే తన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మెడికల్ కళాశాలల్లో పీపీపీ విధానం తీసుకువచ్చారనే విషయం జగన్ తెలుసుకోవాలని హితవు పలికారు.
ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో పీపీపీ విధానంపై రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ బహిరంగ చర్చకు సవాల్ విసిరారని, దాన్ని స్వీకరించే దమ్ము జగన్‌కు లేదన్నారు. తాడేపల్లి ప్యాలెస్, బెంగళూరు వైట్‌హౌ్‌సకే పరిమితిమైన జగన్ మిడిమిడి జ్ఞానంతో వీకెండ్‌లో అలా వచ్చి ఏదో మాట్లాడేసి ఇలా వెళ్లిపోతారని విమర్శించారు. పంటలకు బీమా ప్రీమియం చెల్లించకుండా అన్నదాతలను నిలువునా మోసం చేసిన ఘనత వైసీపీదే అని విమర్శించారు.
పరకామణి చోరీ కేసులో నిజాలు వెలుగు చూస్తాయనే సీఐ సతీ్‌షను హత్య చేశారని ఆరోపించారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపి భక్తుల మనో భావాలని దెబ్బతీశారన్నారు. ఇక జీవితంలో ముఖ్యమంత్రి పదవి రాదనే విషయాన్ని జగన్ గుర్తెరిగి మసలుకోవాలని హితవు పలికారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజకీయ నినాదాలు కాదు.. వివక్షకు ఆధారాలు చూపాల్సిందే
ముఖ్యమంత్రా.. రియల్ ఎస్టేట్ ఏజెంటా..?
Read Latest Telangana News and National News