Share News

Big Alert: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..

ABN , Publish Date - Apr 20 , 2025 | 10:03 PM

Big Alert: వరుసగా రెండు రోజులు వడగాల్పులు వీచనున్నాయని.. ఈ నేపథ్యంలో చాలా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తులు నిర్వహణ సంస్థ ప్రజలకు సూచించింది. బయటకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించాలని తెలిపింది.

Big Alert: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..

అమరావతి, ఏప్రిల్ 20: వాతావరణంలో మార్పుల నేపథ్యంలో రానున్న రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. సోమవారం అంటే రేపు 21-04-2025 శ్రీకాకుళం,విజయనగరం, పార్వతీపురం జిల్లాలోన్ని పలు మండలాల్లో వడగాలులు ప్రభావం చూసే అవకాశముందని రాష్ట్ర విపత్తులు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.

అలాగే మంగళవారం అంటే (22-04-2025) తీవ్ర వడగాలులు వీచే అవకాశముందని తెలిపారు. ఆదివారం నంద్యాల జిల్లాలోని ఔకులో 42.6°C, తిరుపతి జిల్లా వెంకటగిరి,చిత్తూరు జిల్లా నగరి, ప్రకాశం జిల్లా పునుగోడు 42.5°C, నెల్లూరు జిల్లా మనుబోలులో 42.4°C,పల్నాడు జిల్లా వినుకొండ, వైఎస్సార్ జిల్లా ఉప్పలూరు 42.2°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయిందన్నారు.


వేసవి కాలంలో ఎండ తీవ్రంగా ఉండి బయటకు వెళ్లేప్పుడు తలకు టోపి,కర్చీఫ్ కట్టుకోవాలి, అలాగే గొడుగు ఉపయోగించాలని సూచించారు. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త తీసుకోవాలన్నారు. గుండె సంబంధిత వ్యాధులు, షుగర్,బీపీ తదితర అనారోగ్య సమస్యలు ఉన్నవారు.. ఎండలో తిరగకూడదని..శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయ వద్దని సూచించారు.


ఇక ఆకస్మాతుగా పిడుగులతోపడే వర్షాలు పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,చెట్ల క్రింద నిలబడరాదని పేర్కొన్నారు. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇది కూడా చదవండి..

Lightning Strike: క్రికెట్ ఆడుతోండగా పిడుగు పడి.. యువకులు మృతి

Minister Narayana: గుజరాత్‌లో పటేల్ విగ్రహాన్ని పరిశీలించిన మంత్రి నారాయణ బృందం

YSRCP: అధికారం కోల్పోయినా.. అరాచకాలు ఆగలేదు

10th class Students: సార్, ఛాయ్‌ తాగండి, నన్ను పాస్‌ చేయండి

CM Chandrababu: టీ 20 మ్యాచెస్ ఎంత ఇంట్రెస్ట్‌గా ఉంటాయో.. అసెంబ్లీ సమావేశాలు..

CM Chandrababu Birthday: సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకల్లో అపశృతి

CM Chandrababu: ధన్యవాదాలంటూ సీఎం చంద్రబాబు ట్వీట్.. ఎందుకంటే..

kamineni Srinivas:కైకలూరు ఎమ్మెల్యేకి కొల్లేరు నేతలు కృతజ్ఞతలు.. ఎందుకంటే..

For Andhrapradesh News And Telugu News

Updated Date - Apr 20 , 2025 | 10:05 PM