BIG BREAKING: మెగా DSC ఫలితాలు విడుదల
ABN , Publish Date - Aug 11 , 2025 | 09:20 PM
టెట్ వివరాలకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే అధికారిక వెబ్ సైట్‌లో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా తమకు తామే టెట్ వివరాలు సరిచేసుకోనే అవకాశమిచ్చారు.
అమరావతి, ఆగస్ట్ 11: ఏపీ మెగా DSC ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను https://apdsc.apcfss.inలో తెలుసుకోవచ్చు. 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం DSC నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఈ ఫలితాలు విడుదలైన వెంటన ఏం చేయ్యాలంటే..?
అభ్యర్థులు ఫలితాల కోసం అధికారిక వెబ్ సైట్ https://apdsc.apcfss.inను సందర్శించాలి.
హోమ్ పేజీలో కనిపించే "AP DSC Results 2025" లింక్‌పై క్లిక్ చేయాలి.
మీ రూల్ నెంబర్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ తదితర వివరాలను నమోదు చేయాలి.
వివరాలను సబ్‌మిట్ చేసిన తర్వాత.. మీ ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
భవిష్యత్తు అవసరాల కోసం ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకోవడం మంచిది.
జూన్ 6వ తేదీన..
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత.. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నియామకానికి మెగా డీఎస్సీ నిర్వహించింది. ఈ పరీక్ష కోసం మొత్తం 3,36,307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది జూన్ 6 నుంచి జులై 2వ తేదీ వరకు.. అంటే 23 రోజుల పాటు ఈ పరీక్షలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఆ రాష్ట్రానికి సరిహద్దులుగా ఉన్న తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, ఒడిశాల్లో సైతం ఈ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ మెగా డీఎస్సీ పరీక్షలకు 92.90 శాతం మంది హాజరయ్యారు.
రెండు రోజుల వరకే గడువు..
ఇక ఈ ఫలితాలు విడుదల చేసిన అనంతరం మెగా డీఎస్సీ పరీక్ష కన్వీనర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ ద్వారా తుది ఫలితాలు, స్కోర్ కార్డులను పొంద వచ్చని సూచించారు. టెట్ వివరాలకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే అధికారిక వెబ్ సైట్‌లో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా తమకు తామే టెట్ వివరాలు సరిచేసుకోనే అవకాశమిచ్చామన్నారు. ఈ అవకాశం రెండు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుందన్నారు. అంటే ఆగస్ట్ 13వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జాతీయ జెండా కేవలం వస్త్రం కాదు.. స్వాతంత్య్రానికి ప్రతీక : చంద్రబాబు
పులివెందులలో ఎన్నికల వేళ.. వైసీపీకి హైకోర్టు షాక్
For More AndhraPradesh News And Telugu News