CM Chandrababu: పీ4పై సమీక్ష.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
ABN , Publish Date - Jul 10 , 2025 | 09:00 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పీ4 కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మరింత మందిని మార్గదర్శులుగా చేర్చేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
అమరావతి, జులై 10: పీ4 లక్ష్యాలను వివరించడం ద్వారా మరింత మందిని ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సమాజంలో పేదలకు అండగా ఉండేందుకు సిద్దంగా ఉన్న అనేక వర్గాల వారిని ఒక తాటిపైకి తీసుకువచ్చేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు.
ఆ క్రమంలో జులై 18వ తేదీన అమరావతిలో వీరిని డిన్నర్‌కు ఆహ్వానించాలని ఆలోచిస్తున్నారు. గురువారం రాజధాని అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో పీ4 – జీరో పావర్టీ కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీ4 కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చించారు. అందులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు ఇప్పటి వరకు ఈ కార్యక్రమంలో మార్గదర్శులుగా ఉండేందుకు 18,332 మంది పారిశ్రామిక వేత్తలు, ఎన్ఆర్ఐలు, ఉన్నత వర్గాల వారు ముందుకు వచ్చారని ఈ సమీక్షలో వివరించారు. అయితే వీరి ద్వారా 1,84,134 మంది బంగారు కుటుంబాలకు చేయూత అందనుందని సీఎం చంద్రబాబు వివరించారు. అలాగే ఈ కార్యక్రమంలో మార్గదర్శులుగా ఉండే వారిని ప్రోత్సహించేందుకు పలు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
మార్గదర్శులుగా ఉండే వారిని ప్రోత్సహించడానికి స్వయంగా వారితో సమావేశం జరపాలని సీఎం నిర్ణయించారు. ఆ క్రమంలో 200 మంది టాప్ ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలు, భారీ నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఎమ్మెన్సీ కంపెనీల ప్రతినిధులు, సెలబ్రిటీలతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. అందులోభాగంగా వీరిని డిన్నర్‌కు ఆహ్వానించాలని నిర్ణయించారు.
ఈ వార్తలు కూడా చదవండి.
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్
వైద్య పరీక్షలు పూర్తి.. ఇంటికి చేరుకున్న మాజీ సీఎం
Read Latest Andhrapradesh News and Telugu News