Share News

CM Chandrababu: ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Sep 11 , 2025 | 09:46 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ ఎయిర్ పోర్టులో పలువురు ఎంపీలు ఆయనకు స్వాగతం పలికారు.

CM Chandrababu: ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు
CM Chandrababu Naidu

అమరావతి, సెప్టెంబర్ 11: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీ చేరుకున్నారు. శుక్రవారం ఉదయం ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. అందుకోసం గురువారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి న్యూఢిల్లీ బయలుదేరి వెళ్లారు.


సెప్టెంబర్ 9వ తేదీన జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ 452 ఓట్లతో గెలుపొందారు. ఆయన ప్రత్యర్థి,ప్రతిపక్షాల అభ్యర్థి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు పోలయ్యాయి. దీంతో 152 ఓట్ల అధిక్యంతో సీపీ రాధాకృష్ణన్ ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఉప రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముహూర్తం ఖరారు అయింది.


శుక్రవారం ఉదయం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో సీపీ రాధాకృష్ణన్ ఉప రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించనున్నారు. 2030 వరకు సీపీ రాధాకృష్ణన్ ఉప రాష్ట్రపతిగా కొనసాగనున్నారు. అయితే ఉప రాష్ట్రపతి పదవికి జగదీప్ దన్‌ఖడ్ రాజీనామా చేశారు. దీంతో ఈ ఎన్నిక అనివార్యమైంది.


మరో వైపు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే. అదీకాక.. ఉప రాష్ట్రపతి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేశంలోని వివిధ రాష్ట్రాల సీఎంలు, బీజేపీ సీనియర్ నేతలు.. అలాగే కేంద్రమంత్రులు హాజరుకానున్నారు.

ఇవి కూడా చదవండి

నర్రెడ్డి సునీల్ కార్యాలయాల్లో ముగిసిన సోదాలు.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

ఏపీలో మళ్లీ ఐఏఎస్‌లు బదిలీ..

For More AP News and Telugu News..

Updated Date - Sep 11 , 2025 | 09:46 PM