Share News

AP Liquor Scam: నర్రెడ్డి సునీల్ కార్యాలయాల్లో ముగిసిన సోదాలు.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

ABN , Publish Date - Sep 11 , 2025 | 08:47 PM

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డికి చెందిన పలు కార్యాలయాల్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యం కుంభకోణానికి సంబంధించిన పలు కీలక డాక్యుమెంట్లను వారు స్వాధీనం చేసుకున్నారు.

AP Liquor Scam: నర్రెడ్డి సునీల్ కార్యాలయాల్లో ముగిసిన సోదాలు.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
AP Liquor Scam

హైదరాబాద్, సెప్టెంబర్ 11: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. అందులో భాగంగా వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డికి చెందిన కంపెనీలో ఇవాళ(గురువారం) ముమ్మర తనిఖీలు చేశారు. దాదాపు 9 గంటలపాటు సిట్ అధికారులు ఈ సోదాలను నిర్వహించారు. అయితే హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని సాగర్ సొసైటీ అడ్రస్‌తో ఏకంగా నాలుగు కంపెనీలు ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్ 2 స్నేహ బిల్డింగ్‌లోని మూడో ఫ్లోర్‌లో ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ ప్రైజస్ సంస్థ ఏర్పాటు చేసినట్లు డాక్యుమెంట్లు ఆధారంగా కనుగొన్నారు.

అయితే సదరు కంపెనీ కాగితాల్లోనే కానీ.. నిజంగా లేదని అధికారులు నిర్ధారించారు. సాగర్ సొసైటీ రోడ్ నెంబర్ 2లోని గ్రీన్ టెల్ ఎంటర్‌ప్రైజస్‌లో రెండు బృందాలు సోదాలు నిర్వహించాయి. ఏపీ లిక్కర్ స్కామ్ నగదు మళ్లించడానికి పలు డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసినట్లు ఈ దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు గుర్తించారు. అందుకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను వారు స్వాధీనం చేసుకున్నారు.


సునీల్ రెడ్డి న్యాయవాదులు రాక..

మరోవైపు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లోని సాగర్ సొసైటీ గ్రీన్ ఎంటర్‌ప్రైజస్‌లో సోదాలు కొనసాగుతుండగా.. నర్రెడ్డి సునీల్ రెడ్డి తరఫు న్యాయవాదులు అక్కడికి చేరుకున్నారు. తమ సోదాలకు ఇబ్బంది కలిగించవద్దంటూ వారికి సిట్ అధికారులు సూచించారు. అన్ని అనుమతులతోనే తాము ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సునీల్ రెడ్డి తరఫు న్యాయవాదులకు స్పష్టం చేశారు. అనంతరం ఆ న్యాయవాదులను అక్కడి నుంచి బయటకు పంపేశారు. ఈ సందర్భంగా కీలక డాక్యుమెంట్లతోపాటు హార్డ్ డిస్క్‌లు సైతం సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.


ఉదయం నుంచి సోదాలు..

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డి కంపెనీల్లో గురువారం ఉదయం నుంచి సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లోని స్నేహ హౌస్, రోడ్డు నెంబర్ 2 సాగర్ సొసైటీలోని గ్రీన్ టెల్ ఎంటర్‌ప్రైజస్ కార్యాలయాల్లో సొదాలు చేపట్టారు. ఈ సందర్భంగా లిక్కర్ స్కామ్ కు సంబంధించి పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. హైదరాబాద్ కేంద్రంగా లిక్కర్ స్కామ్ విధి విధానాలను నిందితులు ఇక్కడే రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది.


సాగర్ సొసైటీ అడ్రస్‌లతో ఉన్న కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కాగితాల్లో ఉన్న కంపెనీలు.. నిజంగా లేవని సిట్ అధికారులు నిర్ధారించుకున్నారు. ఏపీ లిక్కర్ స్కాం నగదు మళ్ళించడానికి పలు డొల్ల కంపెనీలను నిందితులు ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా సిట్ అధికారులు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

నేపాల్‌లో ఆందోళనలు.. చైనాలో చిక్కుకుపోయిన తెలుగు యాత్రికులు

ఏపీలో మళ్లీ ఐఏఎస్‌లు బదిలీ..

For More AP News and Telugu News..

Updated Date - Sep 11 , 2025 | 09:48 PM