GST 2.0 Reforms 2025: కొత్త జీఎస్టీ స్లాబ్స్.. తెలుగులో జీవోలు విడుదల చేసిన సీఎం
ABN , Publish Date - Sep 21 , 2025 | 09:17 PM
కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన జీఎస్టీ స్లాబ్స్ సోమవారం నుంచి అమల్లోకి వస్తున్నాయి. దీని వల్ల రాష్ట్ర ప్రజలకు రూ.8వేల కోట్ల ప్రయోజనం ఉంటుందని సీఎం చంద్రబాబు చెప్పారు. తెలుగులో విడుదల చేసిన జీవోల బుక్‌లెట్‌ను ముఖ్యమంత్రి..
అమరావతి, సెప్టెంబర్ 21: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీఎస్టీ స్లాబ్స్ సోమవారం నుంచి అమల్లోకి వస్తున్నాయి. తద్వారా అనేక ఉత్పత్తులపై ధరలు భారీగా తగ్గబోతున్నాయి. దీని వల్ల రాష్ట్ర ప్రజలకు రూ.8వేల కోట్ల ప్రయోజనం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ మేరకు జీఎస్టీ 2.0కి సంబంధించిన జీవోలను సీఎం విడుదల చేశారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో జీఎస్టీకి సంబంధించి తెలుగు జీవోల బుక్‌లెట్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అనంతరం అధికారులతో రాష్ట్ర పన్నుల విధానంపై సమీక్షించారు.
సోమవారం నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీ 2.0 నెక్స్ట్‌జెన్ సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ ఎ.బాబు చెప్పారు. కొత్త జీఎస్టీ సంస్కరణల వల్ల రాష్ట్ర ప్రజలకు అదనంగా దాదాపు రూ.2లక్షల కోట్ల ప్రయోజనం లభిస్తుందని అంచనా వేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
ఈ కొత్త పన్నుల విధానం ప్రజల ఖర్చులను తగ్గించడంతోపాటు అన్ని వర్గాల ప్రజలను శక్తిమంతం చేసి, వ్యవస్థలను బలోపేతం చేస్తుందని ఎ. బాబు వెల్లడించారు. వస్తువులపై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడం ద్వారా సామాన్య ప్రజలకు ధరల భారం తగ్గనుందన్నారు.
చరిత్ర సృష్టించిన ఏపీ ప్రభుత్వం..
చరిత్ర సృష్టించిన ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ
తొలిసారిగా తెలుగులో జీవోల విడుదల
నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్న కొత్త జీఎస్టీ విధానం
జీఎస్టీ తగ్గింపుతో పేద, మధ్య తరగతి ప్రజలకు భారీ ఊరట
సామాన్యునికి సైతం అర్థమయ్యేలా, పాలనను చేరువ చేసేలా ప్రభుత్వ ఉత్తర్వులు
తొలిసారిగా తెలుగులో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) 2.0 ఉత్తర్వులు
మొత్తం 11 జీవోలు ఇంగ్లీష్ తోపాటు తెలుగులోనూ జారీ
జీఎస్టీ 2.0కు సంబంధించి తెలుగులో విడుదల చేసిన అన్ని జీవోల బుక్‌లెట్ ను ఆదివారం ఆవిష్కరించిన సీఎం
తగ్గనున్న ధరలు, నూతన GST పై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
జీఎస్టీ 2.0 అనేది కేవలం పన్ను సంస్కరణ కాదు.. ఇది ప్రజలే ముందు అనే విధానమన్న చంద్రబాబు
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి