Paritala Sunitha : రాప్తాడు చెరువులకు నీరందించండి
ABN , Publish Date - Mar 05 , 2025 | 12:17 AM
హంద్రీనీవా ద్వారా తన నియోజకవర్గంలోని 38 చెరువులకు నీరందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంగళవారం ఆమె సీఎం ను ఆయన చాంబర్‌లో కలిసి వినతి పత్రం అందజేశారు. హంద్రీనీవా రెండో దశ లైనింగ్ పనులు చేయడం ద్వారా రాప్తాడు నియోజకవర్గంలోని 38 చెరువులకు నీరందే అవకాశం లేకుండా పోతుందన్నారు. భూగర్భజలాలు తగ్గే ప్రమాదం ఉందని వివరించారు. చెరువులు, ...
సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే పరిటాల సునీత విజ్ఞప్తి
అనంతపురం, మార్చి 4(ఆంధ్రజ్యోతి): హంద్రీనీవా ద్వారా తన నియోజకవర్గంలోని 38 చెరువులకు నీరందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంగళవారం ఆమె సీఎం ను ఆయన చాంబర్‌లో కలిసి వినతి పత్రం అందజేశారు. హంద్రీనీవా రెండో దశ లైనింగ్ పనులు చేయడం ద్వారా రాప్తాడు నియోజకవర్గంలోని 38 చెరువులకు నీరందే అవకాశం లేకుండా పోతుందన్నారు. భూగర్భజలాలు తగ్గే ప్రమాదం ఉందని వివరించారు. చెరువులు, కుంటలకు హంద్రీనీవా నీరందేలా తూములను ఏర్పాటు చేయడం, కాలువ
సమీపంలో వంకలపై ఉన్న చెక్‌డ్యామ్‌లకు నీరందించేలా తూములు ఏర్పాటు చేయాలని కోరారు. కాలువ ఉన్న ప్రాంతంలోని వివిధ గ్రామాల రైతులు, ప్రజలు కాలువను దాటే విధంగా వంతెనలను నిర్మించాలని విన్నవించారు. రాప్తాడులో 70 వేల ఎకరాలకుపైగా హంద్రీనీవా పరిధిలో ఆయకట్టు ఉందన్నారు. జీడిపల్లి నుంచి పేరూరు ప్రాజెక్టుకు నీరందించే పరిటాల రవీంద్ర అప్పర్ పెన్నార్ ఎత్తిపోతల ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతులకు పరిహారం ఇచ్చే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ రాప్తాడు నియోజకవర్గ రైతులకు ఎలాంటి నష్టం జరగనివ్వమని, చెరువులకు నీరందించే విషయంలో రాజీ ఉండదని హామీ ఇచ్చినట్లు పరిటాల సునీత తెలిపారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....