Share News

Photo Controversy: మారని అధికారులు.. జడ్పీ ఆఫీస్‌లో జగన్ ఫోటో.. మండిపడ్డ టీడీపీ ఎమ్మెల్యేలు

ABN , Publish Date - May 21 , 2025 | 01:52 PM

Photo Controversy: అనంత జడ్పీ చైర్ పర్సన్ ఛాంబర్‌లో మాజీ సీఎం జగన్ ఫోటో ఉండటంపై టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ నిబంధన ప్రకారం జగన్ ఫోటోను ఉంచారని జడ్పీ సీఈవోపై ఫైర్ అయ్యారు.

Photo Controversy: మారని అధికారులు.. జడ్పీ ఆఫీస్‌లో జగన్ ఫోటో.. మండిపడ్డ టీడీపీ ఎమ్మెల్యేలు
Photo Controversy

అనంతపురం, మే 21: జిల్లాలోని జడ్పీ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఫోటోను స్టోర్ పక్కన ఉంచడంపై టీడీపీ ఎమ్మెల్యేలు (TDP MLAs) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు (బుధవారం) జిల్లాలో జడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా అధికారుల్లో మార్పు రాని పరిస్థితి. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Former CM YS Jagan Mohan Reddy)ఫోటోను జడ్పీ చైర్‌ పర్సన్ గిరిజమ్మ ఛాంబర్‌లో ఉంచి, ఏపీ సీఎం చంద్రబాబు ఫోటోను మాత్రం స్టోర్‌ రూం వద్ద పెట్టారు. దీంతో సమావేశానికి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, అమిలినేని సురేంద్ర బాబు, ఎంఎస్ రాజు.. గిరిజమ్మ ఛాంబర్‌లో జగన్‌ ఫోటోను చూసి జడ్పీ సీఈవోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఏ నిబంధన ప్రకారం జగన్ ఫోటో పెడతారని టీడీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యాలయంలో మాజీ సీఎం చిత్రపటాన్ని ఎలా ఉంచుతారని జడ్పీ సీఈవోపై మండిపడ్డారు. వెంటనే జగన్ మోహన్ రెడ్డి ఫోటోను తీసివేయించి.. ఆ స్థానంలో జాతిపిత మహాత్మాగాంధీ, సీఎం చంద్రబాబు ఫోటోలను ఎమ్మెల్యేలు పెట్టారు. సీఎం చంద్రబాబు చిత్రపటాన్ని జడ్పీ ఛైర్ పర్సన్ గిరిజమ్మ ఛాంబర్‌లో ఎమ్మెల్యేలు ఏర్పాటు చేయించారు.


కాగా.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కావొస్తున్నా ఉన్నతాధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో ఉండాల్సిన స్థానంలో మాజీ సీఎం జగన్ ఫోటోలను ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంచుతున్నారు. ప్రధానంగా జిల్లా పరిషత్ కార్యాలయాల్లో ఎక్కడ చూసినా జగన్ ఫోటోలు ఉండటంపై అనంత టీడీపీ ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏ విధంగా జగన్ ఫోటోను ఉంచారంటూ జడ్పీ సీఈవోపై మండిపడ్డారు. ప్రభుత్వం మారినా కూడా ఉన్నతాధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదని ఫైర్ అయ్యారు. జడ్పీ చైర్ పర్సన్ ఛాంబర్‌‌లో కూడా మాజీ ముఖ్యమంత్రి ఫోటోలు ఉంచుతున్నారని, సీఎం చంద్రబాబు ఫోటోలు ఉంచడం లేదని విరుచుకుపడ్డారు. అప్పటికప్పుడు జగన్ ఫోటోలను తీయాలని తెలుగు దేశం ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. దీంతో వెంటనే జగన్ ఫోటోను తీసివేసి సీఎం చంద్రబాబు ఫోటోను పెట్టారు.


ఇవి కూడా చదవండి

CM Chandrababu Yoga Day: ప్రపంచానికి భారత్ అందిస్తున్న వరం యోగా

Vizianagaram Terror Suspects: ఉగ్రలింకుల కేసులో ఎన్‌ఐఏ దూకుడు

Read Latest AP News And Telugu News

Updated Date - May 21 , 2025 | 03:10 PM