Share News

GOD : మాఘ పౌర్ణమి పూజలు

ABN , Publish Date - Feb 13 , 2025 | 12:53 AM

మాఘ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం నగరంలోని పలు ఆలయాల్లో పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. అశోక్‌నగర్‌లోని రమాసమేత సత్యనారాయణస్వామి దేవాలయం, మూడోరోడ్డు షిర్డీ సాయిబాబా ఆలయం, మల్లేశ్వరరోడ్డులోని లక్ష్మీ గణపతి మందిరాల్లో సామూహిక సత్యనారాయణ వ్రతం ఆచరించారు.

 GOD : మాఘ పౌర్ణమి పూజలు
Devotees processioning the lord on the chariot

అనంతపురం కల్చరల్‌, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి) : మాఘ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం నగరంలోని పలు ఆలయాల్లో పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. అశోక్‌నగర్‌లోని రమాసమేత సత్యనారాయణస్వామి దేవాలయం, మూడోరోడ్డు షిర్డీ సాయిబాబా ఆలయం, మల్లేశ్వరరోడ్డులోని లక్ష్మీ గణపతి మందిరాల్లో సామూహిక సత్యనారాయణ వ్రతం ఆచరించారు. అలాగే హెచ్చెల్సీ కాలనీ మంజునాథస్వామి దేవాలయంలో అనంత ఐశ్వర్యేశ్వర వ్రతాన్ని శాస్త్రబద్ధంగా నిర్వహించారు. మహామంగళహారతి నివేదనానంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు.

ఉమా నీలకంఠేశ్వరస్వామి గ్రామోత్సవం

రాప్తాడు, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): మాఘమాస పౌర్ణమి సందర్భంగా రాప్తాడులో ఉమా నీలకంఠేశ్వరస్వామి గ్రామోత్సవా న్ని ఘనంగా నిర్వహించారు. గురుస్వాములు చిట్రా నాగేంద్ర, గొరవ శివయ్య నేతృత్వంలో బుధవారం రాత్రి స్వామి అమ్మవారి చిత్రపటాలను ప్రత్యేకంగా అలంకరించి రథంపై కొలువు దీర్చా రు. స్థానిక నీలకంఠేశ్వరస్వామి ఆలయం వద్ద నుంచి శివభక్తు లు శివనామ స్మరణతో పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నారు. కార్యక్రమంలో శివభక్తులు, గ్రామస్థులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Feb 13 , 2025 | 12:53 AM