Share News

Ananthapuram News: కిలో రూ.20కే గోధుమ పిండి..

ABN , Publish Date - Dec 26 , 2025 | 11:31 AM

అనంతపురంలో కిలో గోధుమ పిండి.. కేవలం రూ.20కే విక్రయిస్తున్నారు. బయట మార్కెట్లో రూ. రూ.40ల నుంచి రూ.80ల వరకు అమ్ముతుండగా.. ప్రజల కోసం రాష్ట్రప్రభుత్వం రేషన్ షాపుల్లో కేవలం రూ.20కే విక్రయిస్తోంది. దీంతో ప్రజలు రేషన్ షాపుల్లో కొనుగోలు చేస్తున్నారు.

Ananthapuram News: కిలో రూ.20కే గోధుమ పిండి..

- అనంతపురంలోని రేషన్‌ షాపులకు మాత్రమే..

అనంతపురం: రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌కార్డుదారులకు జనవరి నెలలో గోధుమ పిండి అందజేయనుంది. ఇది అనంతపురం(Ananthapuram) నగరంలోని రేషన్‌కార్డుదారులకు మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో మాత్ర మే సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించిం ది. అనంతరం డిమాండ్‌ను బట్టి మిగిలిన పట్టణప్రాంతాలు, మండలాలు, గ్రామాల వారిగా అందజేయనున్నట్లు సమాచారం. బయటి మార్కెట్‌లో కిలో గోధుమ పిండి రకాలను బట్టి రూ.40ల నుంచి రూ.80ల వరకు లభిస్తోంది.


కానీ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై రూ.20లకే అందజేయనుంది. అనంతపురంలోని 41వేలమంది రేషన్‌కార్డుదారులకు కిలో ప్యాకెట్‌ చొప్పున అందజేయనున్నారు. ఆ మేరకు 41టన్నుల గోధుమ పిండి అవసరం కానుంది. అయితే మండల లెవల్‌ స్టాక్‌(ఎంఎల్‌ఎస్)పాయింట్‌కు 16టన్నులు మాత్రమే చేరినట్లు తెలిసింది. మిగిలింది త్వరలో రానుందని సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ అధికారులు తెలిపారు. కాగా అనంతపురంలోని రేషన్‌షాపులకు ఇంకా గోధుమపిండి చేరలేదు.


pandu1.2.jfif

మరో రెండ్రోజుల్లో సరఫరా చేయనున్నట్లు తెలిసింది. జనవరి 1వతేదీ నుంచి నిత్యావసర సరుకులతో పాటు గోధుమ పిండిని సరఫరా చేయనున్నారు. కాగా జిల్లాలోని మొత్తం 1645 చౌకధరల దుకాణాలకు జిల్లాలోని ఏడు ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి నిత్యావసర సరుకులు చేరా యి. ఈనెలలో 10వేల టన్నుల బియ్యం, 325 టన్నుల చక్కర, 600టన్నుల జొన్నలు, 500టన్నుల రాగులు సరఫరా చేసినట్లు అధికారులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మహానగరంలో మత్తు మూకలు!

ప్రతి దరఖాస్తుకూ జవాబుదారీ

Read Latest Telangana News and National News

Updated Date - Dec 26 , 2025 | 11:31 AM