Water Supply : పోలవరం ఎడమ కాలువ ప్యాకేజీలకు ఆమోదం
ABN , Publish Date - Jan 28 , 2025 | 04:12 AM
పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలోగా ఎడమ ప్రధాన కాలువ ద్వారా పుష్కర, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాల ద్వారా ఉత్తరాంధ్రకు సాగునీరు...
అమరావతి, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలోగా ఎడమ ప్రధాన కాలువ ద్వారా పుష్కర, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాల ద్వారా ఉత్తరాంధ్రకు సాగునీరు, తాగునీరు, పరిశ్రమలకు నీటిని అందించేందుకు జల వనరుల శాఖ కార్యాచరణ చేపట్టింది. ఎనిమిది ప్యాకేజీల ద్వారా రూ.3,198 కోట్ల పనులకు ఆమోదం తెలిపింది. వీటిని ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాలనికాంట్రాక్టు సంస్థలతో ఒప్పందం చేసుకుంది. రూ.254.88 కోట్లకు మొదటి ప్యాకేజీ పనులు (25.6 కిలోమీటర్లు) హైదరాబాద్‌కు చెందిన ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్స్‌కు అప్పగించారు. రూ.171.39 కోట్లతో 1ఏ ప్యాకేజీ సూర్యకాన్స్‌కు, మిగిలిన అత్యవసర పనులు మెస్సర్స్ ఎన్‌సీసీకి రూ.17.75 కోట్లకు ఇచ్చారు.
25.6 కిమీ నుంచి 51.60 కిమీ దాకా ప్యాకేజీ -2.. ఈ పనుల విలువ రూ.233.42 కోట్లు.. హైదరాబాద్‌కు చెందిన సోమ, పటేల్‌కు అప్పగింత. 33.559 కిమీ నుంచి నేషనల్ హైవే క్రాసింగ్ పనులు వెంకటరాజు ఇంజనీర్స్ రూ.26.51 కోట్లకు, వల్లభనేని కన్‌స్ట్రక్షన్స్‌కు రూ.19.82 కోట్లకు.
51.600 కిమీ నుంచి 69.145 కిమీ దాకా ప్యాకేజీ -3.. రూ.233.42 కోట్ల పనులు మేటా్‌స-ఎన్‌సీసీకి. మరో రూ.73.66 కోట్ల పనులు కేఎంవీ ప్రాజెక్ట్సుకు, మిగిలిన అత్యవసర పనులు..క్రాసింగ్ పనులు రూ.122.62 కోట్లకు ఎన్‌సీసీకి అప్పగింత. బీవీఆర్ కన్‌స్ట్రక్షన్స్‌కు రూ.23.45 కోట్ల పనులు.. ఆర్‌ఎస్‌ఆర్ ఇన్‌ఫ్రాకు రూ.15.27 కోట్ల పనులు.
69.145 కిమీ నుంచి 93.700 కిమీ దాకా ప్యాకేజీ-4.. రూ.123.65 కోట్ల పనులు సబీర్ డ్యామ్, వాటర్‌వర్క్స్‌కు.. రూ.170.699 కోట్ల పనులు ఆర్‌ఎ్‌సఆర్-సజిట్టల్‌కు. 77.175 కిమీ వద్ద క్రాసింగ్ పనులు రూ.15.803 కోట్లతో ఆర్‌ఎ్‌సఆర్ ఇన్‌ఫ్రాకు అప్పగింత. 88.035 కిమీ వద్ద రూ.18.46 కోట్లతో క్రాసింగ్ పనులు సూర్యకాన్స్‌కు.
ప్యాకేజీ-5లో రూ.181.36 కోట్ల పనులు సబీర్ డ్యామ్‌కు, మరో రూ.182.97 కోట్ల పనులు పీఎ్‌సకే-హెచ్‌ఈఎస్‌కు.. రూ.307.41 కోట్ల పనులు ఆర్‌వీఆర్ స్టార్ ఇన్‌ఫ్రాకు.. రూ.28.24 కోట్లతో క్రాసింగ్ పనులు పీఎస్‌కేకు అప్పగింత.
ప్యాకేజీ-6లో రూ.126.18 కోట్ల పనులు మధుకాన్-సినో హైడ్రోకు.. రూ.331.73 కోట్ల విలువైన పనులు బీఎ్‌సఆర్‌కు అప్పగింత.
ప్యాకేజీ-7లో రూ.330,73 కోట్ల పనులు కేసీఎల్-జేసీసీజీ జాయింట్ వెంచర్‌కు, రూ.58.112 కోట్ల పనులు ఐవీఆర్‌సీఎల్-స్యూకు.. రూ.58.112 కోట్ల పనులు ఏసీఎల్‌కు.
రూ.6.577 కోట్లతో ప్యాకేజీ-8 పనులు ఆర్‌కేఎన్ ఇన్‌ఫ్రాకు అప్పగింత.
ఈ వార్తలు కూడా చదవండి:
Ayyanna Patrudu Tourism: పర్యాటక రంగంపై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan: నువ్వు మరిన్ని రికార్డులు నెలకొల్పాలి.. దేవాన్ష్‌కు పవన్ అభినందనలు
Ayyanna Patrudu Tourism: పర్యాటక రంగంపై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు
Read Latest AP News And Telugu News